బెజవాడకు చెందిన ఇద్దరు పాత నేరస్తులు చేసిన దొంగతనాలు లిస్ట్ చూసి పోలీసుల సైతం ఆశ్చర్యపోయారు. తాళం వేసిన ఇళ్ళను సెలెక్ట్ చేసుకొని, రెక్కి నిర్వహించి రాత్రికి రాత్రే ఇంటిని లూటీ చేయటంలో ఇద్దరు ఆరితేరారు. ఏపీలో దొంగనతం చేసిన తరువాత తెలంగాణా రాష్ట్రానికి పారిపోయి ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి వీకెండ్‌లో వచ్చి మళ్లీ చోరీలు చేస్తారు.
విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన కోన నాగ దుర్గా మోహన్ పాత నేరస్తుడు. ఇతనికి నేరాల్లో రైట్ హ్యాండ్‌గా సహకరించే వాడు కటారి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్. ఈ ఇద్దరు కలసి రంగంలోకి దిగారంటే చాలు వారం రోజుల పాటు ఫుడ్, బెడ్‌కు లోటు ఉండదు. తాళం వేసిన ఇళ్ళను మాత్రమే ఈ ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటారు.
విజయవాడ నగరలోని మాచవరం బుల్లెమ్మ వారి వీధిలో ఇటీవల దొంగతనం జరిగింది. ఇంటి యజమాని ఫిర్యాదుతో మాచవరం పోలీస్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అద్దెకు ఉంటున్న ఇంటికి రిపేర్ చేస్తున్నారని రెండు రోజులుగా రాత్రి సమయంలో యజమాని, బంధువుల ఇంటికి వెళ్ళారు. మరుసటి రోజు వచ్చి చూస్తే ఇంటి తాళం తీసి ఉంది. బీరువాలోని బట్టలు చిందర వందరగా పడి ఉన్నాయి. పైన రేకులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి ఇంటిలోనికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు, నగదు దొంగిలించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగలోకి మూడు పోలీసు బృందాలు
బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు, కేసును సెంట్రల్ క్రైమ్ పోలీస్ విభాగానిక బదిలీ చేశారు. సెంట్రల్ క్రైమ్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పడి పోలీసులు సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిచుకుని అనుమానితులు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. దీంతో పోలీసులకు ఓ క్లూ లభించింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయం వీధిలో పాత నేరస్తుడు, మరొక వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారించగా కేసు చిక్కుముడి వీడింది.
విజయవాడ కొత్త రాజరాజేశ్వరపేటకు చెందిన కోన నాగ దుర్గా మోహన్ అలియాస్ నాగ అలియాస్ మున్నాతోపాటుగా కేదారేశ్వర పేటకు చెందిన కటారి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ పోలీసులకు చిక్కారు. కోన నాగ దుర్గా మోహన్ అనే పాత నేరస్తుడు గతంలో విజయవాడ, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు చేశాడు. జైలుకు కూడా వెళ్లొచ్చాడు.
రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ పగటి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లపై రెక్కి నిర్వహించి రాత్రి సమయాల్లో దొంగతనం చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలను చేస్తుంటాడు. ఈ క్రమంలో బస్‌స్టాండ్ సమీపంలో పని చేస్తున్న కటారి వెంకటేశ్వర్లుతో పరిచయం ఏర్పడింది.
దొంగిలించిన వస్తువులను అమ్మడం కోసం వెంకట్‌కు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయి అనే ఆశ చూపి తనతో దొంగతనాలకు తీసుకు వెళ్ళేనట్లుగా పోలీసులు గుర్తించారు. విజయవాడ బుల్లెమ్మ వీధిలో జరిగిన దొంగతనం, మధురానగర్‌లోని ఓ ఇంటిలో దొంగతనం కేసు, సీతన్నపేట ఏరియాలో ఓ ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం చేసినట్టు గుర్తించారు. పాత నేరస్తుడు దుర్గామోహన్ ఇంటి లోపలకు వెళ్ళి దొంగతనం చేయటంలో సిద్దహస్తుడు.. కటారి వెంకట్ బయట ఉండి... వివిద రకాల సౌండ్స్ ద్వార మోహన్ సమాచారం ఇస్తుంటాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి చోరీ చేసిన, సుమారు 160 గ్రాముల బంగారం, 1500 గ్రాముల వెండి ఆభరణాలు 24,000 నగదు మొత్తం సుమారు 10 లక్షల రూపాయల విలువైన చోరి సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.