Viral Video:
రీల్ చేస్తుండగా దూసుకొచ్చి కోతి..
ఇప్పుడంతా రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో వాటిని పోస్ట్ చేస్తూ చాలా మంది ఫేమస్ అయిపోతున్నారు. కొంత మంది కేవలం రీల్స్ చేస్తూనే లక్షలు సంపాదిస్తున్నారు. ఇంకొందరు ఇష్టం కొద్దీ చేస్తుంటారు. అయితే...ఒక్కోసారి ఈ రీల్స్ చేసేటప్పుడు జరిగే ఫన్నీ ఇన్సిడెంట్‌లనూ బ్లూపర్స్‌లా రిలీజ్ చేస్తుంటారు కొందరు. అవి ఎంతో నవ్విస్తాయి. ఇప్పుడిలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి ఇన్‌స్టా రీల్స్ చేస్తుండగా.. అనుకోకుండా జరిగిన ఓ సంఘటన నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోందీ వీడియో. ఓ యువతి పచ్చన చెట్ల మధ్య ఉన్న ఓ రోడ్‌పై రీల్స్ చేస్తోంది. రకరకాల ఫోజులు పెడుతూ డ్యాన్స్ చేస్తోంది. అక్కడ కోతి ఉండటాన్ని ఆమె గమనించలేదు. అలా నడుస్తూ ముందుకు రాగానే ఉన్నట్టుండి కోతి దగ్గరకు వచ్చింది. ఆ యువతిపైకి దూకింది. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తింది ఆ యువతి. ఇదంతా రికార్డ్ అయింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా...వెంటనే వైరల్ అయిపోయింది. ట్విటర్‌లో నరేంద్ర సింగ్ అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. చాలా మంది "ఈ వీడియోను లూప్‌లో పెట్టుకుని మరీ నవ్వుకుంటున్నాం" అని కామెంట్ చేస్తున్నారు.