Viral Video: ఓ వ్యక్తి ముక్కు ఆకారంలో ఉన్న మాస్కు ధరించి రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతుంది. సాఫిర్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి రెస్టారెంట్‌లో ముక్కు ఆకారంలో ఉన్న వెరైటీ మాస్క్ ధరించి భోజనం చేస్తున్నాడు.
ఆ ముక్కు ఆకారంలో ఉన్న మాస్క్ పేపర్‌తో తయారుచేశారు. ఆ మాస్క్ ముందు భాగంలో ఓ వ్యక్తి సౌకర్యవంతంగా తినేందుకు వీలుగా రంధ్రం ఉంది. ఈ మాస్క్ ధరించి భోజనం చేస్తున్న వీడియో షేర్ చేసినప్పటి నుంచి పదకొండు వేలకు పైగా వీక్షణలు పొందగా, పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో షేర్ చేస్తూ "ఇలాంటి మాస్క్ ఎక్కడ దొరుకుతుంది"అని అడుగుతున్నారు. మరికొందరు 'ఆహా అద్భుతం' అని కామెంట్ చేస్తున్నారు.
వైరస్ కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తీవ్రత ఎక్కువగా ఉన్న చైనా, థాయ్ లాండ్, జపాన్, హాంకాంగ్, దక్షిణకొరియా వంటి దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్ష RTPCR తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఎవరినైనా కరోనా లక్షణాలతో గుర్తిస్తే వెంటనే వారిని క్వారంటైన్లో ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య శాఖ అంచనా ప్రకారం చైనాలో ఈ వారంలో ఒకే రోజు దాదాపు 37 మిలియన్ల మంది ప్రజలు కరోనా బారినపడ్డారు.
కరోనా మొదటి కేసు చైనాలోని వుహన్ ప్రాంతంలో నమోదై.. ఆ తర్వాత ప్రపంచమంతా వ్యాపించి అతలాకుతలం చేసింది. లక్షలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్లపాటు ప్రపంచ ప్రజల జీవితాలను, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసింది. తాజాగా చైనా దేశం మళ్ళీ కరోనా విజృంభణను ఎదుర్కొంటుంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన బీఎఫ్ - 7 వేరియంట్ వ్యాప్తి కారణంగా మళ్ళీ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది.
కొత్త రూల్
జిన్‌పింగ్ ప్రభుత్వం ఇప్పుడు "మరణానికి నిర్వచనం"మార్చేసింది. ఈ నిబంధన ప్రకారం..ఎవరైనా శ్వాస సంబంధింత సమస్యలతో మరణిస్తేనే వారిని "కొవిడ్ మృతుల" జాబితాలో చేర్చుతారు. కరోనా కారణంగా మిగతా ఎలాంటి ఇబ్బంది కలిగి చనిపోయినా...వాటిని కరోనా మరణాలుగా పరిగణించరు. ఇప్పటికే చైనాపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతుండగా...ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది ఆ ప్రభుత్వం. ఇక అక్కడి ఆసుపత్రులు కరోనా బాధితులతో కిటకిటలా డిపోతున్నాయి .
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మాత్రం శ్మశానాల వద్ద భారీ సంఖ్యలో శవాలను పేర్చి పెట్టారని వార్త రాసింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, అక్కడి పరిస్థితులు ఏ పొంతనా కుదరడం లేదు. ట్విటర్‌లో అక్కడి పరిస్థితులకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. చైనీస్ బ్లాగర్ ఒకరు ఈ వీడియోలు పోస్ట్ చేశారు. కొన్ని ఆసుపత్రుల్లోని మార్చురీల్లో కుప్పలుగా శవాలు పడి ఉన్నాయి. మరో వీడియోలో ఓ వ్యక్తి కరోనా సోకి తీవ్ర లక్షణాలతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యం కోసం చూసి చూసి ఓపిక లేక కిందపడిపోయాడు. ఆ బాధితుడికి చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో లేదు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Christmas 2022: దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు- రాష్ట్రపతి ముర్ము, మోదీ, రాహుల్ ట్వీట్లు