Viral Video: ఈ మధ్య కాలంలో కొంతమంది పాములతో పరాచకాలు ఆడి ప్రాణం పైకి తెచ్చుకున్న ఘటనలు మనం చూశాం. అయితే తాజాగా మరో యువకుడు అలాంటి సాహసమే చేశాడు. ఏకంగా కింగ్ కోబ్రాకు కిస్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






ఇదీ జరిగింది


ఈ వీడియోను సౌరబ్‌ జాదవ్‌ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఆ వీడియోలో ఒక వ్యక్తి కింగ్‌ కోబ్రా నొసట ముద్దు పెట్టుకునే స్టంట్‌ చేశాడు. ఈ సాహసం చేసిన వ్యక్తి కేరళకు చెందిన వావా సురేష్‌. అతను ఇప్పటివకరకు సుమారు 38 వేల విషసర్పాలను పట్టుకున్నాడు.


మూడువేల సార్లుకు పైగా పాము కాటుకి గురయ్యాడు. సుమారు 190కి పైగా కింగ్‌ కోబ్రాలను రక్షించాడు. దీంతో అతన్ని అందరూ కేరళ స్నేక్‌ మ్యాన్‌గా పిలుస్తుంటారు. ఎంత స్నేక్ క్యాచర్ అయినప్పటికీ ఇలాంటి స్టంట్స్‌ చేయడం రిస్క్ అని నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


ఇలాంటిదే


కర్ణాటకలో ఇటీవల ఓ యువకుడు ఇలాంటి సాహసమే చేశాడు. కానీ ఆ సాహసం బెడిసికొట్టి ఆసుపత్రిలో చేరాడు. శివమొగ్గలోని భద్రావతి ప్రాంతంలో జనావాసాలకు మధ్య ఓ నాగుపాము వచ్చింది. పామును చూసి భయపడ్డ స్థానికులు స్నేక్ క్యాచర్ కు ఫోన్ చేశారు. కొంత సమాయానికే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నాడు. ఇక మీరు బయపడాల్సిన పనిలేదంటూ వారికి ధైర్యం చెప్పాడు. కానీ పట్టుకున్న పామును అలాగే తీసుకెళ్లి సమీపంలోని అడవుల్లోనో, లేక ఊరి బయట వదిలేయడమే అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేయడం లాంటివి చేస్తుంటారు స్నేక్ క్యాచర్స్. కానీ ఇతడు కాస్త భిన్నంగా వ్యవహరించేసరికి మొదటికే మోసం వచ్చింది. 


పట్టుకున్న నాగుపామును వదిలేయకుండా స్నేక్ క్యాచర్ ఆ పామును తలపై  ముద్దుపెట్టుకోబోయాడు. అది అసలే పాము.. కాటు వేయడం దాని సహజ స్వభావం. తన తలకు దగ్గరగా రావడంతో స్నేక్ క్యాచర్ మూతిపై ఒక్కసారిగా కాటు వేసింది. నొప్పిని భరించలేక వెంటనే స్నేక్ క్యాచర్ ఆ పామును వదిలేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




Also Read: EC Banned Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు షాక్- 5 ఏళ్లు బ్యాన్ విధించిన ఈసీ!