Viral Video: బాహుబలి సినిమాలో భుజంపైన శివ లింగాన్ని పెట్టుకుని ప్రభాస్ నడిచే సీన్ చాలా హైలెట్ అయింది. అయితే తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఓ వ్యక్తి ఏకంగా బైక్‌ను నెత్తిన పెట్టుకుని బస్సు పైకి ఎక్కించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్టన్ అయిపోయారు.
ఇలా జరిగింది
సాధారణంగా బైక్‌ను పైకి లేపేందుకు కూడా మనకు శక్తి సరిపోదు. అలాంటిది ఓ వ్యక్తి బైక్‌ను తలపై పెట్టుకొని ఏకంగా బస్సు మీదకు ఎక్కించాడు. ముందుగా బైక్‌ను తన నెత్తిన పెట్టుకుని బస్సు దగ్గరకు నడుస్తూ వచ్చాడు. బస్సుకు ఎడమ పక్కగా ఉన్న ఇనుప గ్రిల్స్‌కు ఏర్పాటు చేసిన నిచ్చెన సాయంతో పైకి వచ్చాడు. తన మెడను బ్యాలెన్స్ చేసుకుంటూ బస్సు టాప్‌పైన ఉన్న క్యారియర్‌పై బైక్‌ను దించేశాడు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అన్న దానిపై స్పష్టత లేదు.
కానీ ఈ వీడియోలో కనిపించే బైక్ నంబర్ ప్లేట్ చూస్తే ఆ ద్విచక్ర వాహనం ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందినదిగా తెలుస్తోంది. ఎలాంటి సాయం లేకుండా బైక్‌ను నెత్తిన పెట్టుకొని మోసిన వ్యక్తిని 'సూపర్ హీరో' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.