ABP  WhatsApp

Viral Video: ఎంత కొడితే అంత మద్యం- చేతి పంపు మహత్యం! అవాక్కయిన పోలీసులు!

ABP Desam Updated at: 13 Oct 2022 10:43 AM (IST)
Edited By: Murali Krishna

Viral Video: చేతి పంపు నుంచి మద్యం రావడం ఎప్పుడైనా చూశారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే.

(Image Source: Twitter)

NEXT PREV

Viral Video: లిక్కర్ దుకాణాలు, వైన్‌ షాపులు, బెల్టు దుకాణాలు.. ఇలా మద్యం దొరికే ప్రదేశాలు అందిరకీ తెలిసినవే. అయితే మీరు ఎక్కడైనా చేతి పంపులో నుంచి మద్యం రావటం చూశారా? ఎక్కడైనా చేతి పంపు కొడితే తాగు నీరు వస్తుంది. కానీ అక్కడ మాత్రం చేతి పంపు కొడితే సారా వస్తుంది. ఇదెలా సాధ్యమని అవాక్కయ్యారా? 


ఇదీ సంగతి


మధ్యప్రదేశ్‌ గునా జిల్లాలోని భన్‌పుర గ్రామంలో ఈ వింత జరిగింది. చేతి పంపు కొట్టగానే అందులోంచి మద్యం వచ్చింది. నాటుసారా తయారు చేసే ముఠా వినూత్నమైన ఆలోచన ఇది. నాటుసారా తయారీపై సమాచారం రావడంతో గునా జిల్లాలోని భన్‌పుర గ్రామ పరిసరాల్లో పోలీసులు సోదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులకు ఈ చేతి పంపు కనిపించింది.    




గ్రామ శివారులోని ఇళ్లకు కొద్ది దూరంలో నాటుసారా నింపిన డ్రమ్ములను భూమిలోపల పాతిపెట్టారు. వాటికి పైపును అమర్చడం ద్వారా నేల పైన చేతి పంపును ఏర్పాటు చేశారు. దాన్ని చేత్తో కొడుతూ క్యాన్లలో సారా నింపి అమ్మేస్తున్నారు. సారా మాఫియా అతి తెలివి చూసి పోలీసులే షాకయ్యారు.



భన్‌పుర గ్రామంలో దాదాపు ప్రతి ఇంటిలోనూ నాటుసారా తయారు చేస్తున్నట్లు గమనించాం. డ్రమ్ముల కొద్దీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. భూమిలో దాచిపెట్టిన నాటుసారా డ్రమ‍్ములకు చేతి పంపు ఏర్పాటు చేశారు. చేతి పంపును కొట్టడంతో నాటుసారా పైకి వచ్చింది. లిక్కర్‌ను తీసుకునేందుకు వారు చేతి పంపును ఉపయోగిస్తున్నారు. దానిని ప్లాస్టిక్‌ క్యాన్లు, కవర్లలో నింపి డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారు.                        - పంకజ్‌ శ్రీవాస్తవ, గునా ఎస్పీ 

Published at: 13 Oct 2022 10:43 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.