Viral Video: ఏనుగులు ఒక్కోసారి చేసే పనులు నవ్వొస్తే మరి కొన్ని సార్లు భయం కలిగిస్తాయి. అయితే ఓ ఏనుగు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


ఇదీ జరిగింది


మనకు దురదేస్తే ఏం చేస్తాం? గోక్కుంటాం. అదే మరి ఏనుగుకు దురదేస్తే ఏం చేస్తుంది? ఈ వీడియోలో అదే జరిగింది. ఓ ఏనుగుకు దురద వచ్చి కారుపై తన ప్రతాపం చూపింది. ఏనుగు దెబ్బకు కారు తుక్కుతుక్కయింది. అయితే గోక్కోవడం తప్ప ఏనుగు ఎలాంటి దాడి చేయకపోవడంతో ఆ సమయంలో కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు.   






ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఇది ఎక్కడ జరిగిందన్న విషయం తెలియదు. ఈ వీడియోను మాత్రం నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. "మీరే ఏనుగై ఉండి మీకు దురదేస్తే ఏం చేస్తారు?" అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


మరో ఘటన


సాధారణంగా వీవీఐపీలు, ప్రముఖ రాజకీయ నేతలు, సెలబ్రెటీలకు Z+++ కేటగిరీ భద్రత కల్పిస్తారు. అయితే ఓ పిల్ల ఏనుగుకు ఇలాంటి భద్రత కల్పించడం ఎప్పుడైనా చూశారా? అవును ఈ భద్రత చూస్తే మీరు కూడా అవాక్కవ్వక తప్పదు.


కంటికి రెప్పలా






కోయంబత్తూర్‌లోని సత్యమంగళం ప్రాంతంలో ఓ ఏనుగుల గుంపు రోడ్డుపై నడిచి వస్తుంది. అయితే ఆ ఏనుగుల కాళ్ల మధ్యలో ఓ పిల్ల ఏనుగు నడుస్తోంది. అది బయటకు వచ్చిన ప్రతిసారీ ఆ ఏనుగుల గుంపు అది కనిపించకుండా భద్రంగా ముందుకు తీసుకువెళ్తున్నాయి.


ఈ ఆసక్తికర ఘటనను ఎవరో వీడియో తీశారు. ఈ వీడియోను సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 



ఈ భూమ్మీద ఎవ‌రూ కూడా అంత భ‌ద్ర‌త క‌ల్పించ‌లేరు. అది కేవ‌లం ఏనుగుల గుంపునకే సాధ్య‌మైంది. అప్పుడే పుట్టిన పిల్ల ఏనుగుకు మిగ‌తా ఏనుగులు జ‌డ్ ప్ల‌స్ ప్ల‌స్ ప్ల‌స్ కేటగిరి భ‌ద్ర‌త క‌ల్పించాయి.                                                         "
- సుశాంత నంద, ఐఎఫ్ఎస్ ఆఫీసర్



వీడియో వైరల్


ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. పిల్ల ఏనుగును అంత భద్రంగా తీసుకువెళ్తున్న గజరాజులకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ భద్రత ముందు ఏదైనా సరిపోదని కామెంట్లు పెడుతున్నారు. ఇది Z + + + కేటగిరీ భద్రతలా ఉందంటున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలను షేర్ చేయాలని కామెంట్లు పెడుతున్నారు.


Also Read: Amit Shah Mumbai visit: అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం- ఆంధ్రా ఎంపీ సెక్రటరీ అరెస్ట్!


Also Read: Covid Cases: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 6 వేల మందికి వైరస్