Viral Video:


నిజాయతీగా సమాధానాలు..


దొంగల్లో మంచి దొంగలూ ఉంటారు. దారి తప్పి అలా చోరీలు చేస్తూ బతికేస్తారు కానీ...వారిలోనూ నిజాయితీ ఉంటుంది. ఏంటిది..? ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఇచ్చేస్తున్నారు అని అనుకోకండి. ఈ కింది వీడియో చూస్తే మీరూ దీన్ని ఒప్పుకుంటారు. ఓ చోరీలో పట్టుబడ్డ దొంగ పోలీసులతో ఎంత నిజాయతీగా మాట్లాడాడంటే...అది వింటే "వీడేం దొంగరా బాబు" అనుకుంటారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు ప్రశ్నిస్తుండగా...ఆ దొంగ ఒక్కో సమాధానం చెప్పాడు. ఇదంతా పోలీస్‌ స్టేషన్‌లోనే జరిగింది. ఈ సంభాషణలన్నింటినీ ఎవరో వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "దొంగతనం చేసిన తరవాత నీకేం అనిపించింది" అని ఎస్‌పీ ప్రశ్నించగా.. "దొంగతనం చేసేటప్పుడు ఎంతో మజా వచ్చింది. కానీ..ఇప్పుడు మాత్రం అవమానంగా అనిపిస్తోంది" అని బదులిచ్చాడు దొంగ. మరి ఎందుకు ఈ పని కంటిన్యూ చేస్తున్నావ్ అని అడగ్గా..."అదే సర్ నేను చేస్తున్న తప్పు" అని అమాయకంగా ఆన్సర్ ఇచ్చాడు. ఎంత దొంగిలించావ్ అని ఎస్‌పీ ప్రశ్నించగా.."10 వేలు చోరీ చేశాను సర్" అని చెప్పాడు దొంగ. ఆ తరవాత జరిగిన సంభాషణ ఈ వీడియో వైరల్ అవడానికి మరో కారణమైంది. "చోరీ చేసిన డబ్బుతో ఏం చేశావ్" అని పోలీస్ అడిగిన ప్రశ్నకు ఆ దొంగ ఆసక్తికర సమాధానం చెప్పాడు. "పేదవాళ్లకు పంచి పెట్టాను. వీధుల్లో నివసించే వారికి బ్లాంకెట్స్‌, ఆహారం అందించాను. కుక్కలు, ఆవులకూ ఆహారం ఇచ్చాను" అని షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ఇది విని పోలీసులంతా పెద్దగా నవ్వుకున్నారు. "అలా అయితే నీకు అల్లా ఆశీర్వాదం తప్పకుండా లభించినట్టే" అని పోలీస్ అనగా.."అవును సర్..ఇదంతా ఆయన చలవే" అని చెప్పాడు. 






మందు కావాలంటూ చిన్నారి ఏడుపు..


కొందరు పిల్లలు మంకుపట్టు పట్టి ఏదోటి కావాలని అంటుంటారు. ఏడుస్తుంటారు. ఈ వీడియోలూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడతాయి. ఇప్పుడలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులోనూ ఓ పిల్లాడు మొండి పట్టు పట్టి ఏడుస్తున్నాడు. చూస్తుంటే ఐదేళ్లు కూడా ఉంటాయో లేదో అనిపిస్తోంది కానీ...వాడు ఎందుకోసం ఏడుస్తున్నాడో తెలిస్తే "మహా ముదురు" అని బిరుదు ఇచ్చేస్తారంతా. వాళ్ల నాన్నను బొమ్మ కావాలనో, సినిమాకు తీసుకెళ్లాలనో ఏడవలేదు ఈ బుడ్డోడు. వీడికి మందు కావాలంట. అవును మీరు చదివింది నిజమే. "నాకు మందు కావాలి"అని గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఇది చూసి వాళ్ల నాన్న షాక్ అయ్యాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు. పాలు తాగే వయసులో మందు కావాలంటూ ఈ బుడ్డోడు ఏడ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీడి ఇన్నోసెన్స్‌ని చూసి నవ్వుకోవాలో... కోప్పడాలో అర్థం కాలేదు ఆ తండ్రికి. ఇప్పటికే ఈ వీడియోకి వేలాది వ్యూస్ వచ్చాయి. "ఇది మరీ అతిరా బాబు" అంటూ కొందరునెటిజన్లు కామెంట్‌లు కూడా చేస్తున్నారు.