Viral Video: చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేస్తోన్న ఘటనలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. అయితే ఈ సారి చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది.
ఇలా జరిగింది
ఘజియాబాద్‌లోని 11 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఆ చిన్నారి తన అపార్టమెంట్ కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్లగా ఒకేసారి ఓ కుక్కల గుంపు ఆమె మీదకు దూకాయి.
ఇది గమినించిన ఆ బాలిక వెంటనే పరుగులు పెట్టింది. ఎక్కడా ఆగకుండా తన అపార్టమెంట్స్ కమ్యూనిటీ గేట్‌లోకి ఆ చిన్నారి వెళ్లిపోవటంతో ఆ కుక్కల బారి నుంచి తప్పించుకోగలిగింది. ఆమె ఇలా గేట్‌లోకి రాగానే వెంటనే అక్కడ ఉన్నసెక్యూరిటీ సిబ్బంది బయటకు వచ్చారు. దీంతో ఆ క్కుక్కలు తోక ముడిచి వెనుదిరిగాయి. ఆ బాలిక ఏమాత్రం అజాగ్రత్తగా ఉండి ఉన్నా ఈ పాటికి మరో చిన్నారి కుక్కలకు బలయ్యేది.