Viral News: రైలుకు ఎన్ని బోగీలు ఉంటాయి? మహా అయితే 20 నుంచి 25 బోగీలు ఉంటాయి. కానీ ఆ రైలుకు మాత్రం ఏకంగా 100 బోగీలు ఉన్నాయి. అంతేకాదు నాలుగు ఇంజిన్లు కూడా ఉన్నాయి. ఇదేంటి అనుకుంటున్నారా? ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాసింజర్ రైలు ఇదేనట.


1.9 కిమీ






స్విట్జర్లాండ్ ప్రస్తుతం.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాసింజర్‌ రైలును నడిపి రికార్డు సృష్టించింది. దీనికి ఏకంగా 100 బోగీలు, నాలుగు ఇంజిన్లు ఉంటాయి. 1.9 కిలోమీటర్ల (1.2 మైళ్ల) పొడవైన ఈ రైలును ప్రకృతి రమణీయతకు నెలవైన ఆల్ఫ్స్‌ పర్వతాల్లోని అల్బులా/బెర్నినా మార్గంలో నడిపారు. ప్రెడా నుంచి బెర్గుయెన్‌ వరకు ఈ రైలు శనివారం ప్రయాణం చేసింది. ఈ మేరకు స్విస్‌ రైల్వే కంపెనీ 'రేటియన్‌' ప్రకటించింది. 






ప్రఖ్యాత ల్యాండ్‌వాసర్‌ వయాడక్ట్‌ సహా 48 వంతెనలు, 22 సొరంగాల గుండా పర్వత సానువుల మధ్యన ఒంపులు తిరుగుతూ ఈ మార్గం ఉంటుంది. దీనిని యునెస్కో 2008లోనే ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. మొత్తం 25 కిలోమీటర్ల (15.5 మైళ్ల) దూరం సాగే ఈ ప్రయాణం పూర్తయ్యేందుకు దాదాపు గంట సమయం పట్టింది.


Also Read: Indian Ecomomy: భారతీయులు ఎక్కువగా టెన్షన్ పడే విషయాలివే- సర్వేలో షాకింగ్ ఫ్యాక్ట్స్!