Bigg Boss Telugu 6: దూకుడు సినిమాలో ‘నాగార్జున సర్... వారిని ఎలిమినేట్ చేసేయండి సర్, ఎలిమినేట్ దెమ్ ఇమ్మీడియట్లీ’ అన్న డైలాగ్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ డైలాగ్ ఎక్కడో దగ్గర వినిపిస్తుంది. వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గీతూ రాయల్‌కి క్లాసు తీసుకున్నాక, మళ్లీ ఆ డైలాగ్ ట్రెండవ్వడం మొదలైంది. నెటిజన్లు ‘ఎలిమినేట్ చేసేయండి సర్, ఆమెను ఎలిమిటనేట్ చేసేయండి’ అంటూ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. గీతూ మాత్రం ఈసారి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయింది. తానే బిగ్‌బాస్‌లా మారి సీజన్ మొత్తాన్ని ఆడించేద్దాం అనుకుంది. చూసి చూసి గట్టిగా ఇచ్చిపడేశారు నాగార్జున.
ఇక బిగ్‌బాస్ ఎందుకు?
‘నేను గేమర్‌ని సర్, గేమ్ అంటే మెంటలెక్కిపోతుంది. నేనున్న సీజన్లో ఇలా ఉండకూడదు, అందరూ బాగా ఆడాలి అని అందరినీ రెచ్చగొట్టా సర్’ అని ఏదో చెప్పుకొచ్చింది కన్నింగ్ గీతూ. కానీ నాగార్జున ఆమె మాటలు ఏవీ కూడా పట్టించుకోలేదు. ‘గేమ్ ఎలా ఆసక్తికరంగా మార్చాలో బిగ్ బాస్ చూసుకుంటాడు, నీకెందుకు’ అంటూ సుత్తిమెత్తని మాటలతో గట్టిగా ఇచ్చిపడేశారు. అయినా పిల్ల తగ్గితే కదా ఇంకా ఏదో చెప్పుకోవాలనే చూసింది. ఇంతకుముందులా నాగార్జున, బిగ్‌బాస్ సపోర్ట్ చేస్తారు, చప్పట్లు కొడతారు అనుకుంది. కానీ బయట వస్తున్న విమర్శలను చూసి బిగ్‌బాస్ టీమ్ ముందు జాగ్రత్త పడింది. ఈ వారమంతా గీతూని ఫ్రీగా వదిలేసింది. ఆమె ఏం చేసినా ఏమీ అనలేదు. ఆమె కూడా ఇచ్చిన ఫ్రీడమ్‌ని దుర్వినియోగం చేసుకుని పిచ్చిపిచ్చిగా నచ్చిన డెసిషన్లు తీసుకుంది. చివరికి వీకెండ్లో నాగార్జున ఎపిసోడ్ హైలైట్ అయ్యేలా చేసింది. గీతూని తిట్టాక బయట నెటిజన్ల ఆనందం చూడాలి. వారి కామెంట్లు చూస్తేనే గీతూ తన ప్రవర్తనతో బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంత విసిగించిందో అర్థమైపోతుంది.
చేపల టాస్కులో సంచాలక్ గా ఆమె చేసిన అరాచకం గురించి ఎంత చెప్పినా తక్కువే. బిగ్‌బాస్ షో చరిత్రలో ఎవరూ ఇలా ప్రవర్తించలేదు. అందరూ బిగ్‌బాస్ ఆదేశాల మేరకే నడుచుకున్నారు. కానీ ఈమె నాగార్జున, బిగ్‌బాస్ ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. తనకు నచ్చిన రూల్స్ పెట్టి ఇంటి సభ్యులను ఆడమని చెప్పింది. అంతేనా సంచాలక్ అయి ఉండి తాను కూడా ఆడేసింది. ఒకపక్క ఆమె నమ్మిన బంటు ఆదిరెడ్డి చెబుతున్నా కూడా వినలేదు. పైగా ఫిజికల్ టాస్కు ఇస్తే గుద్ది పడేస్తా బిగ్ బాస్ అంటూ డైలాగులు. అందుకే నెటిజన్లు ఇప్పుడు ఆమెను ఏకిపడేస్తున్నారు.