Shadowless Church in China: ఎంత పెద్ద బిల్డింగ్‌ అయినా, చిన్న ఇల్లైనా సరే దానిపైన ఎండ పడితే కచ్చితంగా నేలపైన నీడ కనిపిస్తుంది. కానీ...చైనాలో మాత్రం నీడే పడని చర్చ్‌ని నిర్మించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇది హాట్‌టాపిక్‌గా మారింది. దీన్ని Shadowless Church గా పిలుస్తున్నారు. ఆర్కిటెక్చర్‌ సెక్టార్‌లోనే ఇదో రికార్డు. సోషల్ మీడియాలో ఈ చర్చ్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. Shanghai Dachuan Architects ఈ చర్చ్‌ని డిజైన్ చేసింది. చైనాలోని చెంగ్డూలో ఈ Sino-French Science Park Church ఉంది. ఫ్రాన్స్‌, చైనా మధ్య ద్వైపాక్షిక బంధానికి గుర్తుగా ఈ చర్చ్‌ని నిర్మించారు. ఈ రెండు దేశాల సంస్కృతి కనిపించేలా ఈ చర్చ్‌ని డిజైన్ చేశారు. దీన్ని ఎలా డిజైన్ చేశారో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. 1953లో ఫ్రాన్స్‌లో నిర్మించిన Langxiang Church డిజైన్‌ స్ఫూర్తితో ఈ చర్చ్‌ని నిర్మించారు. ఫ్రాన్స్‌ ఫిలాసఫీ, అక్కడి కల్చర్‌ని ప్రతిబింబించేలా నిర్మాణం చేపట్టారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్‌లు ఆశ్చర్యపోతున్నారు. ఇదో అద్భుతం అంటూ పొగుడుతున్నారు.