Viral News:


బ్లింకిట్‌పై ఫైర్..


ఆన్‌లైన్‌ ఆర్డర్లకు డిమాండ్ పెరిగిపోయింది. బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకునే టైమ్ లేని వాళ్లు జస్ట్ ఓ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఈ బిజినెస్ బాగుండటం వల్ల మార్కెట్‌లోకి కొత్త సర్వీస్‌లు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా గ్రాసరీలు డెలివరీ చేసే యాప్స్ చాలానే ఉన్నాయి. వాటిలో  బిగ్ బాస్కెట్, బ్లింకిట్‌ ఫేమస్ అయ్యాయి. వీటి సర్వీస్ బాగానే ఉంటున్నా ఒక్కోసారి నిర్లక్ష్యంతో కస్టమర్లను ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి బ్లింకిట్‌లో బ్రెడ్ ప్యాకెట్ ఆర్డర్ చేశాడు. ఆ ప్యాకెట్‌కు కన్నం పడటమే కాకుండా...అందులో ఓ ఎలుక దూరింది (Rat in Bread Packet). ఇది చూసి షాక్ అయిన కస్టమర్ వెంటనే అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫిబ్రవరి 1వ తేదీన ఇది జరిగింది. "బ్లింకింట్‌ వల్ల నాకీ షాకింగ్ అనుభవం ఎదురైంది. బ్రెడ్ ప్యాకెట్‌లోకి ఎలుక దూరింది. అది ఇంకా బతికే ఉంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు చేసుకునే వారికి ఇదో వార్నింగ్" అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. కొన్ని స్క్రీన్‌ షాట్‌లు కూడా షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లో బ్లింకిట్‌ను ట్యాగ్ చేశాడు. దీనిపై కంపెనీ వెంటనే స్పందించింది. క్షమాపణలూ చెప్పింది. 


"తప్పేంటో తెలుసుకున్నాం. ఇలా జరిగినందుకు సారీ. ఇప్పటికే దీనిపై విచారణ చేస్తున్నాం. అవసరమైన చర్యలు కచ్చితంగా తీసుకుంటాం. సర్వీస్‌లు ఇంప్రూవ్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తాం" 














- బ్లింకిట్ 


ఈ పోస్ట్‌లు చూసిన వారు షాక్ అవుతున్నారు. కంపెనీపై మండి పడుతున్నారు. ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు కంపెనీలను విజిట్ చేసి తనిఖీలు చేయాలని మరి కొందరు సలహాలు ఇచ్చారు. నాకు ఇలాంటి అనుభవం ఎదురైతే నేరుగా పోలీసులకే ఫోన్ చేసే వాడిని. ఇది చాలా ప్రమాదకరం అని మరో నెటిజన్ కామెంట్‌ చేశాడు. మరి కొందరు బ్లింకిట్‌ను ట్యాగ్ చేసి వీడియోని రీట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. 


Also Read: Air Asia Fined: ఎయిర్‌ ఏషియాకు షాక్ ఇచ్చిన DGCA,పైలట్‌లకు ట్రైనింగ్ ఇవ్వలేదని భారీ జరిమానా