Salman Khan News: సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు: బాబా రామ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు

ABP Desam   |  Murali Krishna   |  16 Oct 2022 05:34 PM (IST)

Salman Khan News: బాలీవుడ్ ఇండస్ట్రీపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని ఆరోపించారు.

(Image Source: PTI)

Salman Khan News: బాలీవుడ్ బాద్‌షా సల్మాన్‌ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు యోగా గురువు బాబా రామ్‌దేవ్. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని బాబా రామ్‌దేవ్ ఆరోపించారు. సల్మాన్‌ ఖాన్‌తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా బాబా ఆరోపణలు చేశారు.  

సినిమా పరిశ్రమను డ్రగ్స్‌ చుట్టుముట్టింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు. ఆమిర్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారా? లేదా? నాకు తెలియదు. షారుక్‌ ఖాన్‌ కుమారుడు డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు. ఇక హీరోయిన్ల గురించి ఆ దేవుడికి మాత్రమే  తెలుసు. రాజకీయాల్లో కూడా డ్రగ్స్ అడుగుపెట్టింది. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ జరుగుతోంది. డ్రగ్ అడిక్షన్ నుంచి భారత్‌ను విముక్తి చేసేందుకు మనమంతా కట్టుబడి ఉండాలి. దీని కోసం మేము ఉద్యమం చేస్తాం.                                        - బాబా రామ్‌దేవ్, యోగా గురువు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్యవీర్‌, వీరాంగన సదస్సులో బాబా రామ్‌దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌, డ్రగ్స్‌ వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.రామ్‌దేవ్‌ బాబా చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

గతంలో

బాబా రామ్‌దేవ్ అలోపతి వైద్యులపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుర్వేదాన్ని ప్రచారం చేయాలనుకుంటే చేసుకోవచ్చని, కానీ ఇతర వైద్య విధానాలను విమర్శించటం సరికాదని మండి పడింది.

బాబా రామ్‌దేవ్ అలోపతి వైద్యులపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నట్టు? ఆయన వల్లే యోగా పాపులర్ అయింది. ఇది మంచి విషయమే. కానీ ఇతర వైద్య విధానాలను విమర్శించటం దేనికి? ఆయన అనుసరిస్తున్న వైద్య విధానంతో జబ్బులు పూర్తిగా నయమైపోతాయని గ్యారెంటీ ఉందా?                                          -   సుప్రీం కోర్టు

అలోపతి వైద్యంపై బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంలో సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

Also Read: Viral video: మైక్ విసిరేసిన మంత్రి- కార్యకర్తలు మాట వినడం లేదని, వైరల్ వీడియో!

Published at: 16 Oct 2022 05:24 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.