China Spy Balloon Shot Down:



సింగిల్ మిజైల్‌తో...


కొద్ది రోజులుగా అమెరికా ఎయిర్‌ బేస్‌లో చక్కర్లు కొడుతున్న చైనా స్పై బెలూన్‌ను షూట్ చేసేసింది అగ్రరాజ్యం. దాదాపు మూడు బస్సుల సైజ్ ఉన్న ఈ భారీ బెలూన్‌ను Fighter Jet F-22 షూట్ చేసింది. సింగిల్ మిజైల్‌తో ఆ బెలూన్‌ పేలిపోయింది. రక్షణ పరంగా సున్నితమైన ప్రాంతాలను, వ్యూహాత్మక ప్రదేశాలపై నిఘా పెడుతున్న చైనా స్పై బెలూన్‌ను కాల్చేసినట్టు అధికారులు వెల్లడించారు. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. బెలూన్‌ను పేల్చివేయడంపై తీవ్ర అసహనంతో ఉంది. అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అధ్యక్షుడు జో బైడెన్‌ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. 


"విజయవంతంగా ఆ స్పై బెలూన్‌ను పేల్చివేశాం. ఈ పని ఇంత సక్సెస్‌ఫుల్‌గా చేసిన ఫైటర్ జెట్‌ పైలట్‌లకు నా అభినందనలు" 


- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు 


ఈ బెలూన్‌ను బ్లాస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే ఒక మిజైల్ వచ్చి నేరుగా బెలూన్‌ను తాకింది. ఆ వెంటనే ఆ బెలూన్ పేలిపోయింది.