భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీకి కరోనా సోకింది. తనకు కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. పిలిభిట్ లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలో పర్యటించానని ఆయన అన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ కొవిడ్ కేసులు ఎక్కువవడంపై వరుణ్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.






అంతేకాకుండా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల కార్యకర్తలకు బూస్టర్ వ్యాక్సిన్ డోసు ఇచ్చేలా ఎన్నికల సంఘం చూడాలని కోరారు. లేకపోతే ఎన్నికల ప్రచారంతో కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు.


ప్రముఖులకు కరోనా..


కరోనా సెకండ్ వేవ్ సమయంలో సామాన్యులకు ఎక్కువగా కరోనా సోకగా థర్డ్ వేవ్‌లో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. వీరందరికీ ఇటీవల కరోనా వచ్చింది.



  • దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌

  • కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్

  • రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ 

  • మహారాష్ట్రలో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కరోనా బారిన పడ్డారు.


మోగిన ఎన్నికల నగారా..


దేశంలో కీలకమైన ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ నిన్న​ విడుదలైంది. ఏడు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ఎన్నికలకు కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు.


Also Read: Covid 19 3rd Wave: భయంకరంగా కరోనా థర్డ్ వేవ్.. దేశంలో రోజుకు 10 లక్షల కేసులు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి