Vande Bharat passenger assaulted after refusing seat exchange with BJP MLA :  రైల్లోనే..బస్సులోనే వెళ్తూంటే విండో సీట్ కావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్కీగా వస్తే సరే లేకపోతే సర్దుకుని పోతారు. కానీ కొంత మంది ఉంటారు.. ఆ సీటు తమ జన్మహక్కు అని.. ఎవరినైనా లేపేసి తాము కూర్చునే హక్కు ఉందనుకుంటారు. అలాంటి వారితో చాలా సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు ఎక్కువగా అధికారం ఉన్న వారే అవుతారు. ఓ ఎమ్మెల్యే.. అదీ కూడా బీజేపీ ఎమ్మెల్యేకు ఇలాంటి అహంకారమే ఉంది. 

మధ్యప్రదేశ్ కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పరిచా వందే భారత్  రైతులో ప్రయాణిస్తున్నాడు.  జూన్ 19న ఢిల్లీ నుండి భోపాల్‌కు వెళ్తున్నాడు. అయనకు విండో సీట్ రాలేదు.  ఓ ప్రయాణికుడిని సీట్లు మార్చుకోవాలని కోరాడు.  కానీ  దానికి నిరాకరించాడు . ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పరిచా తన భార్య కమ్లి , కుమారుడు శ్రేయాన్ష్‌తో కలిసి E-2 కోచ్‌లోకి వచ్చాడు. ఆయన  50, 51 సీట్ నెంబర్లు వచ్చాయి. ఎమ్మెల్యేకు 8వ నెంబర్ సీటు లభించింది.  

సీట్ నంబర్ 49లో రాజ్ ప్రకాష్ అనే ప్రయాణికుడు కూర్చున్నాడు. అతనిది విండో సీటు ఎమ్మెల్యే సీట్లు మార్చుకోవాలని అడిగాడు. కానీ  ప్రకాష్ నిరాకరించాడు. దీంతో ఎమ్మెల్యే ఫోన్లు చేసి ఝాన్సీ రైల్వే స్టేషన్ కు  గూండాల్ని పిలిపించాడు.  వందే భారత్ రైలు ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, దాదాపు 15-20 మంది వ్యక్తులు కోచ్‌లోకి ప్రవేశించి ప్రకాష్‌పై దాడి చేశారు.  ప్రకాష్ ముక్కు, చెవులు  నోటి నుండి  రక్తం కారేలా కొట్టారు.  రైల్వే పోలీసులు ఎమ్మెల్యే అనుచరులకే సపోర్టు చేశారు.  

మధ్యప్రదేశ్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో దిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఆయన గురించి పట్టించుకున్న వారు లేరు.  దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  ప్రయాణికుడ్ని జైల్లో వేయాల్సి ఉందన్నారు.