Anti-Brahmin Slogans: జేఎన్‌యూ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు- స్పందించిన వీసీ!

ABP Desam Updated at: 02 Dec 2022 12:25 PM (IST)
Edited By: Murali Krishna

Anti-Brahmin Slogans: జేఎన్‌యూ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది.

(Image Source: PTI)

NEXT PREV

Anti-Brahmin Slogans: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లోని గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించిన ఘటనపై వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శాంతిశ్రీ పండిట్ స్పందించారు. దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.



జేఎన్‌యూ క్యాంపస్‌లో ఈ ప్రత్యేక ధోరణులను తీవ్రంగా ఖండిస్తున్నాం. జేఎన్‌యూ అందరికీ చెందినది. కనుక ఇలాంటి సంఘటనలను సహించబోం. ఇందుకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.                                            -   ప్రొ. శాంతిశ్రీ పండిట్ జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్‌


వ్యతిరేకంగా


జేఎన్‌యూలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ భవనాలపై బ్రాహ్మణ, వైశ్య వ్యతిరేక నినాదాలు కనిపించడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ నినాదాలను రాసినట్లు తెలిసింది. 


"బ్రాహ్మణులు ఈ క్యాంపస్‌ను విడిచిపొండి", "There Will Be Blood", "బ్రాహ్మణులారా, భారత్‌ను విడిచిపొండి", "బ్రాహ్మణులారా, వైశ్యులారా, మేం మీ కోసం వస్తున్నాం. ప్రతీకారం తీర్చుకుంటాం" అని ఇలా కొంతమంది గోడలపై రాశారు. 


ఏబీవీపీ


ఈ ఘటనపై అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జేఎన్‌యూ అధ్యక్షుడు రోహిత్ కుమార్ మాట్లాడారు. బ్రాహ్మణ, వైశ్య వ్యతిరేక నినాదాలను రాయడాన్ని ఖండించారు.







కమ్యూనిస్టు గూండాలు ఈ విధంగా విద్యా సంస్థల ప్రాంగణాలను నాశనం చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. స్వేచ్ఛగా ఆలోచించే ప్రొఫెసర్ల ఛాంబర్లను పాడు చేశారు. ఈ నినాదాలకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.                                       -       రోహిత్ కుమార్, ఏబీవీపీ జేఎన్‌యూ అధ్యక్షుడు


Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి రోజా పూలు ఇచ్చిన హీరోయిన్

Published at: 02 Dec 2022 12:23 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.