Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫాటా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకువెళుతున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
విచారణ
ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఉదయం 11:40 గంటలకు ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ కేదార్‌నాథ్ నుంచి గుప్తకాశీ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణం విచారణ తర్వాత తెలుస్తుంది. - సీ రవిశంకర్, ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.
సహాయక చర్యల కోసం SDRF, జిల్లా పరిపాలన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాం. మృతుల కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. - పుష్కర్ సింగ్ ధామీ, ఉత్తరాఖండ్ సీఎం
ఈ ఘటనపై హోంమంత్రి అమిత్ షా కూడా విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
Also Read: J&K Target Killings: నాలుగు రోజుల్లో ముగ్గురి హత్య- కశ్మీర్‌లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు!