Harish Rawat on POK: కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్.. కేంద్ర ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. మోదీ ప్రభుత్వం.. పాకిస్థాన్ నుంచి పీఓకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)ను వెనక్కి తీసుకోవాలన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను వెనక్కి తీసుకోవడం మన కర్తవ్యమని ఆయన అన్నారు.
పాకిస్థాన్
పాకిస్థాన్‌కు కొత్తగా నియమితులైన ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. ప్రతి ఇంచు భూమిని రక్షించుకోవడమే కాకుండా శత్రుదేశంపై దాడి చేస్తామని భారత్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి నియంత్రణ రేఖలోని (Line of Control) రాఖ్‌చిక్రీ సెక్టార్‌లో మునీర్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి సైనికులు, ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నియంత్రణ రేఖలో పర్యటన సందర్భంగా అక్కడి సైనికులు, ఆఫీసర్లతో మునీర్ మాట్లాడారు. ఎల్‌ఓసీలో నెలకొన్న తాజా పరిస్థితులు, కార్యాచరణ సంసిద్ధత, భారత్ ప్రకటనలపై సైనికాధికారులతో చర్చించారు. జనరల్ కమర్ జవేద్ బజ్వా పదవీ విరమణ అనంతరం నవంబర్ 24న పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా అసీమ్ మునీర్ నియమితులయ్యారు.
Also Read: Gujarat Election 2022: 'ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకుందాం'- ఓటేసిన మోదీ