Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ విషాదం జరిగింది. హనుమాన్ వేషం వేసిన వ్యక్తి డ్యాన్స్ చేస్తూ వేదికపై కుప్పకూలి మరణించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
ఫతేపుర్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. సేలంపుర్ గ్రామానికి చెందిన రామ్ స్వరూప్.. దసరా సందర్భంగా శనివారం రాత్రి హనుమంతుడి వేషం వేశాడు. రామ్ లీలా నాటకాన్ని ప్రదర్శించాడు. లంకా దహనం ఘట్టం సందర్భంగా నిప్పంటించిన తోకతో ఒక బల్లపై డ్యాన్స్ చేశాడు.
అయితే గిరాగిరా తిరిగిన అతడు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో డ్యాన్స్ చేస్తున్న బల్ల పైనుంచి కిందపడ్డాడు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరో ఘటన
ఇటీవల స్టేజీపై నృత్యం చేస్తోన్న ఓ వ్యక్తి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిగా తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జమ్మూలోని బిష్నా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతి క కార్యక్రమంలో యోగేశ్ గుప్తా (20) అనే కళాకారుడు పార్వతీదేవి వేషధారణలో నృత్యం చేశాడు. కాసేపు నృత్యం చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
అయితే అక్కడున్న వారంతా నృత్యం చేస్తున్నాడని భావించి అతని వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. కొద్ది క్షణాలైన లేవకపోయేసరికి.. శివుడి వేషధారణలో ఉన్న మరో వ్యక్తి యోగేశ్‌ను లేపేందుకు వెళ్లాడు. అయితే ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో అతడ్ని ఆసుపత్రికి తరలించారు.
గుండెపోటు కారణంగా యోగేశ్ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!
Also Read: Helium Tank Blast Tamil Nadu: రద్దీ మార్కెట్‌లో పేలిన హీలియం ట్యాంక్- వైరల్ వీడియో!