Google Chrome Users: డెస్క్‌టాప్‌లో గూగుల్ క్రోమ్ వాడే వాళ్లకి కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది.  Indian Computer Emergency Response Team హై అలెర్ట్ ప్రకటించింది. క్రోమ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని తేల్చి చెప్పింది. వెంటనే ఆ బ్రౌజర్‌ని అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. లేకపోతో కంప్యూటర్‌లు హ్యాక్ అయ్యే ప్రమాదముందని స్పష్టం చేసింది. భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. గూగుల్ వెబ్‌ బ్రౌజర్‌లో ఉన్న కొన్ని లోపాలను అదనుగా చూసుకుని సైబర్ నేరగాళ్లు దాడి చేసే అవకాశముందని చెప్పింది. అంతే కాదు. denial-of-service (DoS) కండీషన్‌లోకి కంప్యూటర్ వెళ్లేలా చేసి ఆ తరవాత డేటాని చోరీ చేసే ప్రమాదముందని వివరించింది. 

Continues below advertisement


ఏం జరుగుతుంది..?


CERT-In సూచనల ఆధారంగా చూస్తే కొన్ని గూగుల్ క్రోమ్ వర్షన్స్‌కి ముప్పు పొంచి ఉంది. వెంటనే వాటిని అప్‌డేట్ చేయకపోతే నష్టం తీవ్రంగా ఉంటుంది. అందుకే హై రిస్క్‌ అలెర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. కోడింగ్‌లో తప్పులు దొర్లే ప్రమాదముందని, ఈ కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించింది. కోడింగ్‌లో సమస్యలు వచ్చినప్పుడు సులువుగా సైబర్ దాడులు జరిగే ప్రమాదముంటుంది. ఓ సిస్టమ్‌ని టార్గెట్ చేసి అటాకర్స్‌ డేటాని కరప్ట్ చేసే అవకాశముంది. అంతే కాదు. ఆయా కంప్యూటర్‌లలో తమకు నచ్చిన కోడ్‌ని రన్ చేసి డేటాని చోరీ చేస్తారు. పూర్తిగా కంప్యూటర్ వాళ్ల అధీనంలోకి వెళ్లిపోతుంది. దీన్నే DoS condition గా పిలుస్తారు. మాల్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసి, అత్యంత కీలకమైన డేటాని యాక్సెస్ చేసేందుకు వీలుంటుంది. అందుకే...వీలైనంత త్వరగా క్రోమ్ బ్రౌజర్స్‌ని అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం చెబుతోంది. 


ఎలా అప్‌డేట్ చేసుకోవాలి..?


ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయాలి. కుడి వైపు కనిపించే మూడు వర్టికల్ డాట్స్‌పై క్లిక్ చేయాలి. అందులే మెనూ అనే ఆప్షన్‌ని ఎంపిక చేసుకోవాలి. అక్కడే Help అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. About Google Chrome పైన క్లిక్ చేయాలి. అప్పుడు క్రోమ్‌ కొత్త అప్‌డేట్స్ కోసం సెర్చ్ చేస్తుంది. ఆటోమెటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. అప్‌డేట్ పూర్తయ్యాక రీలాంచ్ ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. అక్కడితో అప్‌డేషన్ పూర్తవుతుంది. యూజర్‌లు బ్రౌజర్‌లో ఆటోమెటిక్ అప్‌డేట్ ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకోవాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. 


Also Read: Viral Video: షాపింగ్‌ మాల్‌లో భారీ డిస్కౌంట్‌లు, తెరిచిన కాసేపటికే ఎగబడ్డ వేలాది మంది - పూర్తిగా లూటీ