Watch Video:
బర్గర్ తింటున్న బాలుడిపై కాల్పులు..
అమెరికాలో గన్ కల్చర్ హింసకు దారి తీస్తోంది. అక్కడ రోజుకో దారుణం వెలుగు చూస్తోంది. ఈ సారి ఏకంగా పోలీసే ఓ టీనేజర్‌పై కాల్పులు జరపటం సంచలనమైంది. టెక్సాస్‌లోని సాన్ యాంటోనియో ప్రాంతంలో ఓ 17 ఏళ్ల బాలుడిపై గన్‌తో దాడి చేశాడు. కార్‌లో కూర్చుని బర్గ్ తింటుండగా...కార్‌లో నుంచి బయటకు రావాలని పోలీస్ బెదిరించాడు. ఆ బాలుడు ఎందుకు అని ప్రశ్నించాడు. వెంటనే గన్ తీసి కాల్పులు జరిపాడు పోలీస్. మెక్‌డొనాల్డ్స్‌లోని కార్ పార్కింగ్‌లో జరిగిందీ ఘటన. అయితే...ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే...ఆ టీనేజరే రూల్స్ బ్రేక్ చేశాడని, పోలీస్‌ని తిట్టాడని కేస్ బుక్ చేశారు. కానీ...పోలీస్ బాడీ కెమెరా విజువల్స్‌ని పరిశీలించాక...పోలీస్‌దే తప్పు అని అర్థమైంది. వెంటనే బాలుడిపై ఉన్న కేస్‌ను విత్‌డ్రా చేశారు. ప్రస్తుతం గాయాలతో బాలుడు చికిత్స పొందుతున్నాడు. కార్‌లో కూర్చుని బర్గర్ తింటున్న బాలుడిని కావాలనే బెదిరించినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. కేవలం పోలీస్‌ని ప్రశ్నించినందుకే కాల్పులు జరిపాడు. వెంటనే కార్ డోర్ మూసేసి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు ఆ టీనేజర్. అయినా వెనక్కి తగ్గకుండా ఆ పోలీస్..కార్‌ని వెంబడిస్తూ మరీ కాల్పులు జరిపాడు. కార్‌లో మరో అమ్మాయి ఉందని, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. టీనేజర్‌పై కాల్పులు జరిపిన ఆఫీసర్‌ని అరెస్ట్ చేశారు. ఆ టీనేజర్ కార్‌లో ఎలాంటి గన్ లేదని, పైగా అతను ఎవరినీ డిస్టర్బ్ కూడా చేయలేదని స్పష్టం చేశారు.