US President Joe Biden:
ఫెమా ఆఫీస్‌లో స్పీచ్..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ మధ్య కాలంలో తన ప్రవర్తనతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇటీవల జరిగిన ఓ మీటింగ్‌లో చనిపోయిన ఆవిడ పేరుని పిలుస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు బైడెన్. ఇప్పుడు మరో చోట ఇలాంటి ప్రవర్తనతోనే అందరినీ షాక్‌కు గురి చేశారు. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (FEMA)ఆఫీస్‌లో అందరితో మాట్లాడారు. హరికేన్ ఇయాన్ సహాయక చర్యల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నందుకు FEMAను ప్రశంసించారు. ఈ స్పీచ్ పూర్తయ్యాక...ఉన్నట్టుండి పక్కకు వెళ్లారు బైడెన్. అక్కడి క్రౌడ్ వద్దకు వెళ్లి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. RNC Research అఫీషియల్ ట్విటర్ పేజ్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. స్పీచ్ పూర్తిగా కాగానే థాంక్యూ అని వెంటనే కుడి వైపు తిరిగారు. పక్కనే ఉన్న ఫెమా అధికారి ఒకరు "మిస్టర్ ప్రెసిడెంట్" అని పిలుస్తూనే ఉన్నారు. అయినా...ఆమెను పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్లారు బైడెన్. అందరికీ వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. "ఇదెంతో బాధాకరం" అని కొందరు రెస్పాండ్ అవుతుంటే...మరి కొందరు ఇదేంటి అలా వెళ్లిపోతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.
గతంలోనూ ఇంతే..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు అప్పుడప్పుడు ఇలా వైరల్ అవుతూ ఉంటాయి. గతంలో ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఓ వేదికపై గందరగోళానికి గురైన బైడెన్.. తన ప్రసంగం తర్వాత ఎటువైపు వెళ్లాలో అర్థం కాక తికమకపడ్డారు. న్యూయార్క్‌లో గ్లోబల్ ఫండ్స్‌కు చెందిన సమావేశంలో జో బైడెన్ ప్రసంగించారు. అనంతరం పోడియం దగ్గరి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఆగిపోయారు. ఎటువైపు వెళ్లాలో అర్థం కాక తికమకపడ్డారు. అక్కడే ఏదో మాట్లాడినా చప్పట్ల శబ్దంలో అది కూడా వినిపించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కరోనా మహమ్మారి గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ 19 కథ ముగిసిందని బైడెన్ ప్రకటించారు. అయితే కొవిడ్‌తో సమస్యలు ఉన్నాయన్నారు. ఇటీవల డెట్రాయిట్‌లో జరిగిన ఆటో షోలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బైడెన్ ప్రకటనపై రిపబ్లికన్లు విమర్శలు చేశారు. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని పొడిగించడాన్ని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి ముగిస్తే మళ్లీ దీనిని పొడిగించడం దేనికి అని ప్రశ్నించారు. వాస్తవానికి వచ్చే నెలతో పబ్లిక్ హెల్త్ ఎమర్జీ సమయం ముగియాల్సి ఉంది. ఒక వేళ ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ముగిస్తే దాదాపు 1.5 కోట్ల మందికి బీమా సౌకర్యం అందదు.
Also Read: RBI Repo Rate Hike: సామాన్యుడిపై వడ్డీల పిడుగు- మరోసారి రెపో రేటు పెంపు!