Jahnavi Death Case:
రోడ్డు ప్రమాదంలో మృతి
అమెరికాలో ఓ ఇండియన్ స్టూడెంట్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. MS చేయడానికి వెళ్లిన జాహ్నవి సియాటెల్‌లోని Northeastern Universityలో మాస్టర్స్ చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిందీ ఘటన. అప్పటి నుంచి విచారణ జరుగుతోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీస్ ప్యాట్రోలింగ్ వెహికిల్ ఢీకొట్టి జాహ్నవి ప్రాణాలు కోల్పోయినట్టు తేలింది. అంత కన్నా దారుణం ఏంటంటే...ఆమె చనిపోయిందన్న వార్త తెలియగానే ఓ పోలీస్ ఆఫీసర్ నవ్వుతూ జోక్‌లు వేశాడు. ఇటీవల పోలీసులు విడుదల చేసిన వీడియోలో పోలీస్ ఆఫీసర్ డానియల్ ఆర్డెరర్ (Daniel Auderer) తన కార్‌లో ఉండగా జాహ్నవి గురించి మాట్లాడాడు. కావాలనే కార్‌తో ఢీకొట్టి చంపిన నిందితుడు, మరో పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్‌తో డిస్కస్ చేశాడు. ఆ సమయంలోనే గట్టిగా నవ్వుతూ, జోక్‌లు చేశాడు. అంతే కాదు. ఆమె ప్రాణాలకు విలువే లేదని చాలా చులకనగా మాట్లాడాడు. ఇదంతా పోలీస్ కార్‌లోని డ్యాష్‌బోర్డ్‌లో ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది. "ఆమె చనిపోయింది" అని చెప్పగానే గట్టిగా నవ్వాడు. ఆ తరవాత "ఆమె వయసు 26 ఏళ్లంతే. ఆమె లైఫ్‌కి పెద్ద వాల్యూ లేదు. చెక్‌పైన ఈ అమౌంట్ రాసుకో. 11 వేల డాలర్లు ఇస్తాను" అని చెప్పాడు. ఈ వీడియో సంచలనం సృష్టించింది.
ప్యాట్రోల్ వెహికిల్ ఢీ..
సియాటెల్ కమ్యూనిటీ పోలీస్ కమిషన్ (CPC) ఈ స్టేట్‌మెంట్‌ని విడుదల చేసింది. వీళ్ల మాటలు వింటుంటే గుండె పగిలిపోతోందంటూ పోస్ట్ చేసింది. సియాటెల్ ప్రజలకు మరింత భద్రత కల్పించాల్సి ఉందని, ఇలాంటి వాటిని సహించేదే లేదని తేల్చి చెప్పింది. కేవలం తాము కచ్చితంగా విచారణ చేపడుతున్నామని ప్రజలకు తెలియజేసేందుకే ఈ వీడియో విడుదల చేసినట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోందని, అప్పటి వరకూ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (Jahnavi Kandula) సౌత్ లేక్ యూనియన్ వద్ద పోలీస్ ప్యాట్రోల్ వెహికిల్ ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయింది. Seattle Fire Department నుంచి కాల్ రాగా ఓ పోలీస్ ఆఫీసర్ కార్‌ని వేగంగా డ్రైవ్ చేశాడు. అదే సమయంలో రోడ్డు దాటుతోంది జాహ్నవి. కార్ వేగంగా వచ్చి ఆమెని బలంగా ఢీకొట్టింది. అయితే..ఇందులో పోలీస్ ఆఫీసర్ తప్పేం లేదని కార్ కంట్రోల్ తప్పలేదని అనుకున్నారంతా. కానీ..విచారణ చేసిన తరవాత కార్ ఆ సమయంలో 74 MPH స్పీడ్‌తో వెళ్తోందని తేలింది. జాహ్నవి ఈ డిసెంబర్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ తీసుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంది. అయితే...ఈ యువతి మృతిపై పోలీసులు జోక్‌లు చేసుకోవడంపైనే ఇండియన్ కమ్యూనిటీ తీవ్రంగా మండి పడుతోంది. ఇది కచ్చితంగా జాత్యంహకారమే అని ఫైర్ అవుతోంది. ఈ కేసుని పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది.
Also Read: Kerala High Court: పోర్న్ వీడియోలు, ఫొటోలు అలా చూడటం నేరం కానేకాదు: కేరళ హైకోర్టు