American Presidential Elections: అమెరికాలో త్వ‌ర‌లో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ విడుద‌లైన ఓ స‌ర్వే సంచ‌ల‌న విష‌యాల‌తో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ స‌ర్వే ప్ర‌కారం అమెరికాలో విడాకులు తీసుకున్న పురుషులు ఎక్కువ‌గా డొనాల్డ్ ట్రంప్‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. వారి నుంచి గ‌ణ‌నీయ‌మైన మ‌ద్ద‌తు ద‌క్కుతోంద‌ని అభిప్రాయ‌ప‌డింది. 


అమెరికన్ లైఫ్ అనే సంస్థ ఈ సర్వే నిర్వ‌హించి వివ‌రాల‌ను వెల్ల‌డింది. స‌ర్వే ప్ర‌కారం విడాకులు తీసుకున్న 56 శాతం మంది పురుషులు తాము ట్రంప్ న‌కు ఓటు వేయబోతున్నార‌ని తెలియ‌జేసింది. అదేవిధంగా విడాకులు తీసుకున్న మహిళల్లో 42 శాతం మంది కూడా ట్రంప్‌కే త‌మ ఓటు అని తెలిపారు. ఈ సర్వే ప్ర‌కారం చూస్తే ట్రంప్‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న స్త్రీ పురుషుల మ‌ధ్య ఓట్ల శాతంలో భారీ వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. ఇదే సంద‌ర్భంలో 50 శాతం వివాహిత పురుషులు, 45 శాతం మంది వివాహిత మహిళలు ట్రంప్‌కు మద్దతుగా ఉన్నారు.






1990ల నుంచి వివాహిత అమెరికన్లు, పురుషులు, మహిళలు ఇద్దరూ రిపబ్లికన్ అభ్యర్థులకే స్థిరంగా ఓటు వేశారు. 2024లో, వివాహిత ఓటర్లలో 48 శాతం మంది ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నారు. ది సర్వే సెంటర్ ఆన్ అమెరికన్ లైఫ్ డైరెక్టర్, డేనియల్ ఎ. కాక్స్, మాట్లాడుతూ గ‌త శ‌తాబ్ద కాలంగా విడాకులు తీసుకున్న వారిపై ప్ర‌త్యేక ఆస‌క్తితో స‌ర్వే నిర్వ‌హించిన‌ట్టు వెల్ల‌డించారు. ద‌శాద్ద‌కాలంగా విడాకుల తీసుకున్న జంట‌లపై చేసిన స‌ర్వేలో ఓట్ల విభ‌జ‌న భారీగా పెరిగిన‌ట్లు గుర్తించామ‌న్నారు. గ్యాలప్ పోల్స్‌ను ఉద్దేశించి కాక్స్ మాట్లాడుతూ విడాకులు తీసుకున్న స్త్రీ పురుషుల మధ్య రాజకీయ విభజన గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నేడు ఎక్కువగా ఉంద‌ని తెలిపారు. 


ఎప్పుడూ లేనంతగా ఇటీవలి కాలంలో అమెరికన్ రాజకీయాలు మ‌రింతగా దిగ‌జారిపోతున్నాయి. స్త్రీ పురుషులను ఏకతాటిపైకి తీసుకురావడానికి బదులు వారిని దూరం చేస్తున్నాయి. పోటీ చేస్తున్న అభ్య‌ర్థులు సైతం కుటుంబాల ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాల గురించి కాకుండా  స్త్రీ, పురుషులను వేరు చేసేలా వారి వ్యక్తిగత ఆసక్తుల గురించి మాట్లాడుతున్నార‌ని కాక్స్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


Also Read: సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్, ఇకపై ఎన్నికల ప్రచారానికి ఫుల్‌స్టాప్ - దాడి ఎఫెక్ట్
 
స్త్రీ, పురుషులు గ‌తం క‌న్నా ఒక‌రికొక‌రు అన్యోన్యంగా ఉంటున్న వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేదు. ఒకరినొకరు చూసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, వారి కష్టాల్లో అండ‌గా ఉండేందుకు, వారి విజయాలను పండ‌గ‌లా జరుపుకోవడానికి ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఆ ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ప్రస్తుత లింగ వివక్షను రాజకీయాలు సృష్టించలేదు, కానీ అది పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. స్త్రీ, పురుషులు ఒక‌రి వ‌ల్ల మ‌రొక‌రి బాధ క‌లిగిన‌ప్పుడు వాటిని ఏమాత్రం దాచుకోవ‌డానికి ఇష్ట ప‌డ‌టం లేదు. మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకుంటే స‌రిపోయేదానికి వెంట‌నే వాటిని రోడ్డుకు లాగి రాజ‌కీయం చేసేస్తున్నారు. ఈ ప‌రిణామాలు మంచిది కాద‌ని నా అభిప్రాయం. 


ఇక్క‌డ మరొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే, స్వయంగా విడాకులుతీసుకున్న ఇద్దరు అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ కూడా ఒకరు. అతను తన మొదటి భార్య ఇవానా ట్రంప్‌ను 1992లో, రెండవ భార్య మార్లా మాపుల్స్‌తో 1999లో విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం త‌న మూడవ భార్య మెలానియాతో క‌లిసి ఉంటున్నారు. 1981 మరియు 1989 మధ్య దేశ నాయకుడిగా పనిచేసిన రోనాల్డ్ రీగన్, విడాకులు తీసుకున్న ఏకైక ఇతర US అధ్యక్షుడు. అతను 1952లో తన రెండవ భార్య నాన్సీ డేవిస్‌ను వివాహం చేసుకునే ముందు 1949లో తన భార్య జేన్ వైమన్ నుండి విడిపోయాడు. 


Also Read: ఇ-బైక్ బ్యాటరీ పట్టుకుని లిఫ్ట్‌ ఎక్కిన వ్యక్తి, క్షణాల్లోనే పేలుడు - వీడియో


ట్రంప్ త‌న పుస్త‌కం ది ఆర్ట్ ఆఫ్ ది కమ్‌బ్యాక్‌లో, "వివాహం పని చేయనప్పుడు చాలా విచారంగా ఉంటుంది, కానీ అది ఒక అభ్యాస అనుభవం కూడా కావచ్చు" అని రాసుకొచ్చారు. 2022లో, నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం, ఈ గణాంకాలను నివేదించే 45 రాష్ట్రాలలో మొత్తం 6,73,989 జంట‌లు విడాకులు తీసుకున్నాయి. ఇది 1,000 జనాభాకు 2.4 విడాకుల రేటుగా ఉంది.