Indian Students Attacked in US: అమెరికాలో భారతీయులపై వరుస దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇండియన్ స్టూడెంట్స్‌ని టార్గెట్‌గా చేసుకుని కొందరు దాడులకు తెగబడుతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రత కల్పించడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమవుతోందని మండి పడుతున్నారు. ఈ క్రమంలోనే National Security Council ప్రతినిధి ఒకరు స్పందించారు. ఇలాంటి హింసాత్మక ఘటనలపై తీవ్రంగా స్పందిస్తామని, నిందితులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాంటి వాళ్లని క్షమించం అని స్పష్టం చేశారు. అమెరికాలో ఇలాంటి  హింసకు తావు లేదని వెల్లడించారు.  


"ఇలాంటి హింసాత్మక ఘటనల్ని అస్సలు ఉపేక్షించం. ఏ పరమైన వివక్షకూ తావులేదు. అమెరికాలో ఇలాంటి హింసను ప్రేరేపిస్తే క్షమించం. అధ్యక్షుడు జో బైడెన్‌ ఇలాంటి ఘటనలపై చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇలాంటి దాడుల్ని అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. దాడి చేసిన వాళ్లకు కఠిన శిక్షలు పడేలా చేస్తాం"


- జాన్ కిర్బీ, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ 


గత కొద్ది వారాల్లో నలుగురు భారతీయ విద్యార్థులు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో జార్జియాలోని లిథోనియాలో వివేక్ సైనీపై ఓ వ్యక్తి దాడి చేసి చేశాడు. ఆ తరవాత  Indiana Wesleyan University లో చదువుతున్న సయ్యద్ మజహిర్ అలీపైనా దాడి జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అంతకు ముందు అకుల్ ధావన్, నీల్ ఆచార్యలపైనా ఇదే విధంగా దాడులు జరిగాయి. 


వరుస దాడులు..


అమెరికాలో భారత సంతతికి చెందిన విద్యార్థి మృతి చెందడం స్థానికలకం కలకలం సృష్టించింది. ఇండియానాలోని Purdue University లో చదువుతున్న 23 ఏళ్ల సమీర్ కామత్ (Sameer Kamath) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఇదే యూనివర్సిటీకి చెందిన భారత సంతతికి చెందిన విద్యార్థి ఇలా మృతి చెందడం రెండోసారి. ఈ ఏడాదిలో అమెరికాలో మొత్తం నలుగురు విద్యార్థులు ఇలానే ప్రాణాలు కోల్పోయారు. అనుమానాస్పద స్థితిలో సమీర్‌ మృతదేహాన్ని కనుగొన్నారు. ఓ పార్క్‌లో డెడ్‌బాడీని గుర్తించారు. గతేడాది ఆగస్టులో  Purdue Universityలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు సమీర్. ఆ తరవాత అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నాడు. 2025లో PHD పూర్తవ్వాల్సి ఉంది. ఇంతలోనే ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ అటాప్సీకి పంపారు. త్వరలోనే ఈ రిపోర్ట్‌ విడుదల చేస్తామని పోలీసులు వెల్లడించారు. చికాగోలో భారతీయ విద్యార్థిపై దొంగలు దారుణంగా దాడి చేశారు. సాయం కోసం గట్టిగా అర్థిస్తూ రోడ్డుపై బాధితుడు పరిగెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రక్తస్రావం అవుతున్నా దొంగల దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైన సాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 


Also Read: Karnataka Budget 2024: కర్ణాటక బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన సీఎం సిద్దరామయ్య, పద్దులోని హైలైట్స్ ఇవే