UP Govt Announces Life Imprisonment for Stray Dogs: వీధి కుక్కులపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీధి కుక్కల కోసంస ఏడ్చేవాళ్లు కొంత మంది.. వాటిని కనిపించకుండా చేయాలని డిమాండ్ చేసే వాళ్లు కొంత మంది ఉన్నారు. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే యూపీ ప్రభుత్వం విచిత్రమైన నిర్ణయం తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

Continues below advertisement

మనుషులను అకారణంగా కరిచే కుక్కలను మొదట పది రోజుల పాటు  జంతు కేంద్రంలో ఉంచుతారు.  రెండోసారి కాటు కరిస్తే  'జీవిత ఖైదు' విధించాలని నిర్ణయించారు.  అంటే  ఆ కుక్క చనిపోయేవరకూ  యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రంలోనే ఉంచుతారు.  ఈ నిర్ణయం రాష్ట్రంలో పెరిగిపోతున్న కుక్క  కాట్ల సంఖ్యను తగ్గించడానికి తీసుకున్నట్లుగా యూపీ ప్రభుత్వం ప్రకటించింది. 

యూపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అమృత్ అభిజాత్ ఆదేశాలు వైరల్ అయ్యాయి.  ఇది రాష్ట్రంలోని అన్ని గ్రామీణ, పట్టణ సివిక్ బాడీలకు వర్తిస్తుంది. ఆర్డర్ ప్రకారం,  మనుషులను కరిచిన  కుక్కను సమీప  యానిమల్ బర్త్ కంట్రోల్ (ఎబీసీ) కేంద్రానికి తీసుకెళ్లాలి. అక్కడ మొదటి సారి కాటు వేసిన కుక్కను 10 రోజుల పాటు  అబ్జర్వేషన్‌లో ఉంచి, స్టెరిలైజేషన్   చేసి, మైక్రోచిప్ ఇచ్చి మళ్లీ అసలు ప్రదేశంలో విడుదల చేయాలి. రెండో సారి ఎవరినైనా కరిస్తే, ఆ కుక్కను ఇక యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ కు తీసుకు వచ్చి అక్కడే ఉంచాలి. ఎవరైనా అడాప్ట్ చేసుకునే వ్యక్తి  వస్తే ఆ కుక్కను చూసుకుంటానని, రోడ్లపై వదలబోనని అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అఫిడవిట్ ఇచ్చి కూడా వదిలేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. 

Continues below advertisement

ఇందు కోసం ఓ కమిటీ వేస్తారు. కమిటీలో  వెటర్నరీ డాక్టర్, జంతువులకు ట్రైనింగ్ ఇవ్వడంలో  అనుభవం ఉన్న వ్యక్తి, మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధి ఉంటారు. వీరు కుక్క కరిచిన తర్వాత  అది అకారణమా కాదా అని నిర్ధారిస్తారు.  ఈ నియమాలు జాతీయ అనిమల్ బర్త్ కంట్రోల్ (డాగ్స్) రూల్స్, 2023కు అనుగుణంగా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో రోజుకు వేలాది మంది కుక్కల కాట్లకు గురవుతున్నారని, రాబీస్ వ్యాధి ప్రమాదాలు పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల సుప్రీంకోర్ట్ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో రోగులైన కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్‌లకు తీసుకెళ్లాలని ఆదేశించింది, కానీ తర్వాత  స్టెరిలైజ్ చేసి విడుదల చేయాలని చెప్పింది. ఈ ఆర్డర్ ఆధారంగా తీసుకున్న చర్యగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.