UP Election 2022: మాట తప్పని ప్రియాంక గాంధీ.. 40 శాతం మహిళలకే టికెట్లు.. ఉన్నావ్ బాధితురాలి తల్లికి ఛాన్స్

ABP Desam Updated at: 13 Jan 2022 01:24 PM (IST)
Edited By: Murali Krishna

యూపీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 125 మందితో కూడిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

యూపీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

NEXT PREV

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో 40 శాతం టికెట్లు మహిళలకే కేటాయించడం విశేషం. మరో 40 శాతం టికెట్లు యువతకు ఇచ్చింది కాంగ్రెస్.


125 మంది..


తొలి జాబితాగా 125 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. 125 మందిలో 50 మంది మహిళలే ఉన్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా దేవికి కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.


సోన్‌బాద్రా ఘటనపై గళమెత్తిన నాయకుడికి ఉంబా నియోజకవర్గం టికెట్ ఇచ్చింది. షాజాన్‌పుర్‌ స్థానంలో ఆశా వర్కర్ పూనమ్ పాండేకు అవకాశం ఇచ్చింది. ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన పార్టీ నేత సదాఫ్ జాఫర్‌కు లఖ్‌నవూ సెంట్రల్ టికెట్ ఇచ్చారు. 








బాధిత మహిళలు, మహిళా జర్నలిస్ట్‌లు, సినీ రంగానికి చెందిన నటీమణులు ఇలా పలువురు మహిళలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. మహిళలు, యువతకు టికెట్లు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ నవ చరిత్రకు నాంది పలికింది. రాష్ట్రంలో కొత్త రాజకీయాలకు ఇది శ్రీకారం.                                                - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి


కాంగ్రెస్ హామీలు..



  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆశావర్కర్లకు నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని వాగ్దానం. 

  • రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ.

  • గోధమ, వరి పంటలు క్వింటాల్‌కు రూ. 2,500, క్వింటాల్ చెరకును రూ. 400ల చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటన.

  • ప్రజలందరికీ రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని హామీ.

  • విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్లు, ఎలక్ట్రిక్ స్కూటీలు అందజేస్తామని వాగ్దానం.


Also Read: Assembly Elections 2022: ఓవైపు భాజపా సీఈసీ భేటీ.. మరోవైపు 2 రోజుల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఔట్


Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!


Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Published at: 13 Jan 2022 12:39 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.