ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపాకు షాక్ తగిలింది. రాష్ట్ర మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన కేబినెట్ పదవికి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరింత మంది..
తన రాజీనామా లేఖలో కూడా స్వామి ప్రసాద్ మౌర్య ఇదే కారణం చెప్పారు. అంతేకాంకుండా రానున్న రోజుల్లో మరింత మంది భాజపా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని జోస్యం చెప్పారు.
ఎస్పీలోకి చేరిక..
మౌర్య రాజీనామా చేసినట్లు ప్రకటించిన కాసేపటికే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. మౌర్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఆయనను పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
తొందరపాటు..
మౌర్య రాజీనామాపై ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలతో మొదటికే మోసం వస్తుందన్నారు.
బీఎస్పీ నుంచి..
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సీనియర్ నేతల్లో ఒకరైన స్వామి ప్రసాద్ మౌర్య.. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందే భాజపాలో చేరారు. భాజపా తరఫున ప్రదౌనా స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం లేబర్ మినిస్టర్‌గా అవకాశం వచ్చింది. మరోవైపు ఆయన కుమార్తె సంఘమిత్ర మౌర్య బదౌన్ స్థానం నుంచి భాజపా ఎంపీగా ఉన్నారు.
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!