UP ATS Busts Major Conversion Racket : యూపీలో చంగూర్ బాబా అనే వ్యక్తి ఇస్లాంలోకి మారితే డబ్బులు ఇస్తామని ఆశపెడుతున్నారు. పలువురు డబ్బులు ఇచ్చి ఇస్లాం మతంలోకి మారేలా చేస్తున్నాడని ఆరోపణలు రావడంతో పోలీసులు రెయిడ్ చేసి ముఠాను పట్టుకున్నారు. వారి ఆర్థిక లావాదేవీలు, చేస్తున్న మత మార్పిళ్ల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తమకు తెలియకుండా ఇంత జరుగుతోందా అని ఫీలయ్యారు. జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా అనే వ్యక్తిని అక్రమ మతమార్పిడి రాకెట్‌కు మాస్టర్‌మైండ్‌గా గుర్తించి, జూలై 5, 2025న బలరాంపూర్ జిల్లాలోని మధ్‌పూర్ గ్రామంలో అరెస్ట్ చేశారు. అతనితో పాటు అతని భార్య నీటూ అలియాస్ నస్రీన్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఈ రాకెట్‌కు సుమారు రూ. 100 కోట్ల విదేశీ నిధులు వచ్చినట్లు గుర్తించారు. ఇవి ఇస్లామిక్ దేశాల నుండి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ నిధులు 40కి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా, కొన్ని నకిలీ పేర్లతో తెరిచిన ఖాతాల ద్వారా వచ్చాయి. ఇది భారీ స్థాయిలో మనీలాండరింగ్ గా గుర్తించారు.
జమాలుద్దీన్ హిందూ , ఇతర నాన్-ముస్లిం సమాజాల నుండి వ్యక్తులను ఇస్లాంకు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాకెట్‌లో ప్రేమ సంబంధాలు, బలవంతం,ఆర్థిక ఆకర్షణల ద్వారా మతమార్పిడులు చేస్తూ వస్తున్నారు. జమాలుద్దీన్ కులం ఆధారంగా మతమార్పిడి రేట్లను నిర్ణయించారు బ్రాహ్మణ, క్షత్రియ, సిక్కు మహిళలకు రూ. 15-16 లక్షలు, ఒబిసి మహిళలకు రూ. 10-12 లక్షలు, ఇతర కులాలకు రూ. 8-10 లక్షలు ఇచ్చి మత మార్పిళ్లకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తుంచారు. జమాలుద్దీన్, అతని నెట్‌వర్క్ సభ్యులు దాదాపు 40 సార్లు ఇస్లామిక్ దేశాలకు ప్రయాణించారని, ఇది రాకెట్‌కు అంతర్జాతీయ సంబంధాలను సూచిస్తుందని అధికారులు తెలిపారు. జమాలుద్దీన్ గత 3-4 సంవత్సరాలుగా చంద్ ఔలియా దర్గా సమీపంలో నివసిస్తూ, హజ్రత్ బాబా జమాలుద్దీన్ “పీర్ బాబా” అనే సూఫీ సాధువు పేరుతో హిందూ గుర్తింపుతో జీవించారు. “షిజ్రా-ఎ-తయ్యబా” అనే పుస్తకాన్ని ప్రచురించి, ఇస్లాం ప్రచారానికి ఉపయోగించారు. విదేశీ నిధులతో జమాలుద్దీన్ లగ్జరీ ఆస్తులు, బంగళాలు, హై-ఎండ్ వాహనాలు, షోరూమ్‌లను కొనుగోలు చేశారు. ఈ నిధులు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆస్తుల కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు.
గోమతీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ యాక్ట్, 2021 కింద కేసు నమోదు చేశారు. పారిపోయిన జమాలుద్దీన్‌ను ట్రేస్ చేసి పట్టుకుని లక్నో జిల్లా జైలుకు పంపారు. ఈ రాకెట్ ద్వారా కనీసం 40 మంది వ్యక్తులు బలవంతంగా లేదా డబ్బు ఆశచూపి ద్వారా ఇస్లాం మతంలోకి మార్చారు. మైనర్లను కూడా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
BJP ఎంపీ డాక్టర్ నిశికాంత్ దుబే ఈ మతమార్పిడుల వెనుక ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయని, జమాలుద్దీన్ , నస్రీన్ హిందువుల మతమార్పిడి చేయడానికి వందల కోట్ల నిధులు పొందారని ఆరోపించారు.