Racist attacks on Telugu people  in America: వలస దారులకు ప్రపంచ కేంద్రంగా ఉన్న .. అమెరికాలో కూడా అక్కడి  జాత్యాహంకారం పెరిగిపోతోంది. తాజాగా ఓ నిజామాబాద్ యువకుడికి ఎదురైన పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఓ అమెరికన్.. యూ ట్యూబ్ కోసం వీడియో తీసుకుంటూ ఓ దుకాణం దగ్గర తనకు కనిపించిన యువకుడ్ని దబాయించాడు.                            

అమెరికాకు ఎందుకొచ్చావ్.. తిరిగి నీ ఇండియాకు వెళ్లిపో అని మండిపడ్డాడు. మా అమెరికాలో మీ భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు..ఎక్కడ చూసినా కనిపిస్తున్నారని అన్నాడు. మీరు ఇక్కడ ఉండటం నాకు నచ్చట్లేదు, తిరిగి వెళ్లిపోండి..మా  దేశస్థులు బ్రౌన్ పీపుల్ని  భరించలేకపోతున్నామని వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను  ఆ అమెరికన్ వీడియోలో పెట్టుకున్నాడు. ఆ వీడియో క్లిప్ వైరల్ గామారింది.  

కొంత మంది ఈ వీడియోకు తెలంగాణలో పరిస్థితుల్ని ముడిపెట్టి విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేస్తున్న వ్యాఖ్యలను చతూపించి.. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలోనూ ఏర్పడుతున్నాయని అంటున్నారు. 

అమెరికాలో పెద్ద ఎత్తున భారతీయులు నివాసం ఉంటున్నారు.  అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య దాదాపు 12.3 లక్షలు గా ఉందని యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా ఆధారంగా స్టాటిస్టికల్ అట్లాస్ రిపోర్ట్ రికార్డుల ప్రకారం చెబుతున్నారు.  ఈ సంఖ్య 2016లో 3.2 లక్షల నుండి నాలుగు రెట్లు పెరిగింది, ఇది తెలుగును అమెరికాలో 11వ అత్యంత మాట్లాడే విదేశీ భాషగా, భారతీయ భాషలలో హిందీ, గుజరాతీ తర్వాత మూడవ స్థానంలో నిలిపింది. వీరంతా అక్కడ స్థిరపడిన వారే..  చదుుకోవడానికి ప్రతీ ఏడాది పెద్ద ఎత్తున వెళ్తున్నారు.                  

తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా కాలిఫోర్నియా , టెక్సాస్ , న్యూజెర్సీ  రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి విద్యార్థులు  ప్రతి సంవత్సరం 60,000-70,000 మంది వరకూ అమెరికా వెళ్తున్నారు. అలాగే  H-1B వీసా హోల్డర్లు  సుమారు 10,000 మంది , సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో ఇటీవలి వలసల  కారణంగా జనాభా పెరుగుతున్నారు.  అక్కడ ఇండియన్స్ ఎక్కడ చూసినా కనిపిస్తూండటంతో అమెరికన్లు వ్యతిరేకత పెంచుకుంటున్నారు.