AP EAMCET Counselling 2025: ఆంధ్రప్రదేశ్‌కు EAMCET సంబంధించి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన వారు జులై 16 లోపు ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.  పూర్తి వివరాల కోసం eapcetsche.aptonline.in/EAPCET లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. 

అధికారిక వెబ్‌ సైట్ ద్వారా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం 

ఆగస్టు నుంచి ఇంజినీరింగ్ విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఇంజినీరింగ్‌, అగ్నికల్చర్‌, మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఏపీ AP EAMCET or AP EAPCET 2025లో ఉత్తీర్ణత సాధించిన వారంతా ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. ముందు అధికారిక వెబ్‌సైట్‌ eapcetsche.aptonline.in/EAPCETలో వెళ్లి ప్రోసెస్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. కొంత ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. 

ప్రస్తుతం విడుదల చేసిన EAMCET కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ప్రకారం ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు జులై 16 లోపు తమ వివరాలు నమోదు చేయాలి. ఫీజు చెల్లించాలి. ఇలా పంపించిన వివరాలను జులై 17 లోపు పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నోటిఫై చేసిన కేంద్రాలు చేపడతాయి.  

EAMCET కౌన్సెలింగ్‌ పూర్తి షెడ్యూల్ ఇదే 

కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించిన అభ్యర్థులు జులై 13 నుంచి 18 వరకు వెబ్‌ఆప్షన్‌లు ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే వారికి వచ్చిన ర్యాంకు ఆధారంగా వారు కోర్సు, కాలేజీని ఎంపిక చేసుకోవాలి. జులై 18వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు టిక్ చేసుకున్న వారు తామ ప్రాధాన్యతలను జులై 19న ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చు.

ఆగస్టు 4 నుంచి క్లాస్‌లు ప్రారంభం 

కౌన్సెలింగ్‌లో పాల్గొని ఫీజు చెల్లించి, వెబ్‌ఆప్షన్లు ఎంచుకున్న వారికి సీట్లను కేటాయిస్తూ జులై 22న జాబితా విడుదల చేస్తారు. ఇక్కడ సీట్లు వచ్చిన జులై 23 నుంచి 26 వరకు అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీలకు వెళ్లి అడ్మిషన్లు పొందాలి. వీళ్లకు ఆగస్టు 4 నుంచి కాలేజీ ప్రారంభమవుతుంది. దీంతో మొదటి ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. 

చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఇవే

మొదటి ఫేజ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని అనుకునే విద్యార్థులు కొంత ఫీజును చెల్లించాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు 1200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 600 రూపాయలు చెల్లించి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కాలేజీ సీట్లలో 85 శాతం స్థానిక అభ్యర్థులకే ఇస్తారు. 15 శాతం సీట్ల కోసం స్థానికిలు, స్థానికేతరలు కూడా పోటీ పడతారు. 

రెండో దశ కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుంది?

మొదటి ఫేజ్‌లో జాయిన్ అయిన విద్యార్థులు, ఇంకా ఉన్న ఖాళీలను ఆధారంగా చేసుకొని రెండో దశ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆగస్టులో ప్రకటిస్తారు. మొదటి దశలో వచ్చిన కాలేజీలు నచ్చకపోయినా, లేదా వేరే ఇతర కారణాలు ఉన్నా సరే మీరు రెండో కౌన్సెలింగ్‌ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రభుత్వం నిర్వహించిన ఎంట్రెన్స్‌ టెస్టులో మంచి ర్యాంకు వచ్చి ఇంటర్‌మీడియెట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులుల కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులు. తగిన పర్సంటేజ్ లేకపోయినా అర్హులు కారు.