ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద ఎత్తున వలసలు పెరుగుతున్నాయి. దీంతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో 80 శాతం మద్దతు ఒక పార్టీకి ఉంటే 20 శాతం మరోవైపు ఉందని యోగి చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
భాజపాకు 20 శాతం కంటే తక్కువ సీట్లు వస్తాయని అఖిలేశ్ జోస్యం చెప్పారు.. మిగిలిన 80 శాతం సీట్లు సమాజ్‌వాదీ పార్టీకి వస్తాయన్నారు.
పార్టీలో చేరికలు..
ఇటీవల యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌కు రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ ఈరోజు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.
వీరితో పాటు ఐదుగురు భాజపా ఎమ్మెల్యేలు భగవతి సాగర్, రోషన్ లాల్ వర్మ, వినయ్ శాక్య, బ్రిజేష్ ప్రజాపతి, ముఖేశ్ వర్మ కూడా అఖిలేశ్ యాదవ్ పార్టీలోకి వచ్చారు. మరో ఎమ్మెల్యే అమర్ సింగ్ చౌదరి కూడా సమాజ్‌వాదీ పార్టీ కండువా కప్పుకున్నారు.
403 అసెంబ్లీ స్థానాలున్నా ఉత్తర్‌ప్రదేశ్‌కు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడవనున్నాయి.
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!