కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. ఆయనకు సంబంధించిన ఏ వార్త అయినా.. సంచలనమే. అసలు ఆయన ఏం చేసినా వార్తే.. ఆయన్ను ద్వేషించే అమెరికాలోని పత్రికల్లో సైతం పతాక శీర్షికల్లో కిమ్‌ తరచూ దర్శనమిస్తుంటారు. మరి అలాంటి కిమ్ జీవితం చాలా రహస్యంగా ఉంటుంది. ది స్కౌండర్ నివేదిక ప్రకారం, కిమ్ సంపద 2018 సంవత్సరంలో ఏడు నుండి 10 బిలియన్ డాలర్ల (నాలుగు లక్షల కోట్ల రూపాయల నుంచి ఏడు లక్షల కోట్ల) మధ్య ఉంటుందని అంచనా వేశారు. 



  1. 36 ఏళ్ల కిమ్ తన డబ్బులో ఎక్కువ భాగం ఆఫ్రికా నుంచి ఉత్తర కొరియాకు అక్రమంగా ఏనుగు దంతాల స్మగ్లింగ్, మద్యం అక్రమ రవాణా, ఆయుధాలు, మాదకద్రవ్యాల అమ్మకం ద్వారా సంపాదిస్తారని పేరుంది.

  2. ప్రపంచంలోని అనేక దేశాలలో ఆయనకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఈ బ్యాంకులు సాధారణంగా అమెరికా, యూరప్, ఆసియాలో ఉంటాయి. ఈ ఖాతాలు వేర్వేరు పేర్లతో నిర్వహిస్తున్నారు. 2013 సంవత్సరంలో అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా జరిపిన దర్యాప్తులో ఉత్తర కొరియాలో 200 కి పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయని తేలింది. ఇందులో ఆయుధాల అమ్మకం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది.

  3. కిమ్ కోరిక మేర ఉత్తర కొరియాకు వెళ్లిన బాస్కెట్‌బాల్ స్టార్ డెనిస్ రాడ్‌మన్ తెలిపిన వివరాల ప్రకారం, కిమ్ జీవితం విలాసాలతో నిండి ఉంటుందట. అతను ప్రతి సంవత్సరం తన విలాసాల కోసం సుమారు రూ.405 కోట్లు ఖర్చు చేస్తాడు. మద్యం కోసం ఏడాది పొడవునా ఆయన చేసిన ఏకైక వ్యయం రూ. 20 కోట్ల దాకా ఉంటుందని అంచనా.

  4. ఉత్తర కొరియా నుండి పారిపోయి, ఇతర దేశాలలో ఆశ్రయం పొందే ప్రజలు.. కిమ్ చాలా విలాసపురుషుడు అని తేల్చి చెప్పారు. ఆయనకు సూపర్ పడవలు, ద్వీపాలు, రిసార్ట్స్ ఉన్నాయి. ఆయనకు పార్టీలు ఇవ్వడం అలవాటు అని, వైన్, జున్ను రెండు అతనికి ఇష్టమైనవని తెలిపారు.

  5. బ్రిటీష్ వార్తాపత్రిక ది స్టార్ ప్రకారం, కిమ్ దగ్గర బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ బెంజ్ కార్లు ఉన్నాయి. ఆయన కారు గ్యారేజీలో అనేక లిమౌసిన్లతో పాటు. సొంతంగా ప్రైవేట్ రిసార్ట్ ఉంది. ఆయన విపరీతంగా షాపింగ్ చేయడంతో పాటు తనకు నమ్మకమైన ఉన్నతాధికారులకు ఖరీదైన బహుమతులు కూడా ఇస్తాడని పేరు,

  6. కిమ్ నివాసం రాజధాని ప్యాగ్యాంగ్‌లో ఉంది, ఆయన ఇంటి చుట్టూ విపరీతమైన భద్రత ఉంటుంది. కిమ్ ఖరీదైన గడియారాలను కూడా ఇష్టపడతారు. ఇది కాకుండా, అతని వద్ద చాలా విలువైన పియానోలు ఉన్నాయి. వెయ్యి సీట్లతో సినిమా థియేటర్ కూడా ఉంది.

  7. విదేశాలలో కిమ్ తాను కోరిన వస్తువుల కొనుగోలు కోసం, ఇతరుల ఖాతాలకు డబ్బులు బదిలీ చేసికొనుగోలు చేయిస్తారట..


ఇలా కిమ్ గురించి చాలా రహస్యాలు అప్పుడప్పుడు వార్త పత్రికల్లో, మీడియాలో వస్తుంటాయి. ఏది ఏమైనా కిమ్ జోంగ్ ఉన్.. ఓ మిస్టరీ మనిషని మాత్రం చాలా మంది చెబుతారు.