Union Budget 2024 Ashwini Vaishnav :  వైజాగ్ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల స్థలం అవసరం. అది రాగానే పనులు వేగం అందుకుంటాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణువ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభత్వం కేటాయించాల్సిన భూమి ఇంకా మాకు అందలేదని తెలిపారు. రైల్వే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 


ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు    రూ. 9,138 కోట్లు కేటాయింపు         


 దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్న లక్ష్యంతో ప్రధాని మోడీ బడ్జెట్ కేటాయింపులు జరిపారని గుర్తు చేారు.  2009-14 లో ఉమ్మడి ఏపీ కి రూ. 886 కోట్లు మాత్రమే కేటాయింపులు ఉండేవన్నారు.  ఇప్పుడు కేవలం ఏపికి రూ. 9,138 కోట్లు కేటాయింపు చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ లో ఉన్న రైల్వే లైన్లలో   97% ట్రాక్స్ కి విద్యుదీకరణ పూర్తి అయిందని తెలిపారు.  ఏపీలో 72 స్టేషన్లు అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నాం .. 709 ఫ్లై ఓవర్, అండర్ బ్రిడ్జి ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. 


తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ. 5,071 కోట్ల కేటాయింపు                               


తెలంగాణ విషయానికి వస్తే.. ఈ ఏడాది రూ. 5,071 కోట్ల కేటాయింపు జరిగిందన్నారు.  850% వృద్ధితో కొత్త లైన్ ల నిర్మాణం జరిగింది. తెలంగాణలో 100% ఎలక్ట్రిక్ ట్రాక్స్ ఉన్నాయని స్పష్టం చేశారు. 40 అమృత్ స్టేషన్లు తెలంగాణలో నిర్మిస్తున్నామని తెలిపారు.  వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్స్ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేశామని అశ్విని వైష్ణువ్  తెలిపారు.  తద్వారా అయా జిల్లాల ఉత్పత్తులు  10 రెట్ల ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. అయోధ్యకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కొత్త రైళ్లు వేస్తామని కేంద్రం మంత్రి తెలిపారు.  వారానికి ఒక కొత్త రైలు నిర్మాణం జరుగుతోందని..  కొత్తవి అందుబాటులోకి రాగానే కొత్త సర్వీస్ మొదలు అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రలో చాలా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయిని గుర్తు చేశారు.  


ఏపీ సర్కార్ స్థలం కేటాయించకపోవడంతో జోన్ ఆలస్యం                                    


ఏపీలో   రైల్వే జోన్ అంశం రాజకీయంగా సున్నితమైనది. ఐదేళ్ల కింట ఖచ్చింగా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న సందర్భంలో విశాఖకు రైల్వేజోన్ ప్రకటిస్తూ కేంద్ర కేబిెనెట్ నిర్ణయం తీసుకంది. అయితే ఐదేళ్లు గడినా చిన్న పని కూడా ప్రారంభం కాలేదు. ఏపీ ప్రభుత్వానికి భూమి కేటాయించాలని పదే పదే రైల్వే శాఖ విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో విశాఖ వాసుల చిరకాల కోరిక అయిన రైల్వే జోన్ కల సాకారం కావడం లేదు. డీపీఆర్ ఎప్పుడో రెడీ అయిపోయిందని..  కానీ స్థలం లేకపోవడం వల్లనే పనులు చేయలేకపోతున్నామని అశ్విని వైష్ణువ్ చెబుతున్నారు.