Interim Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఈ పద్దు ఉందని కొనియాడారు. మూలధన వ్యయం (capital expenditure) రికార్డు స్థాయిలో రూ. 11,11,111 కోట్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్రవ్యలోటుని గమనిస్తూనే ఈ లక్ష్యాన్ని సాధిస్తామని వెల్లడించారు. దీన్నే ఆయన Sweet Spotగా అభివర్ణించారు. ఈ బడ్జెట్ ద్వారా ఎన్నో ఉద్యోగావకాశాలూ లభిస్తాయని స్పష్టం చేశారు.