Union Budget 2023:


ఉడాన్‌ స్కీమ్‌లో భాగంగా..


బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా కొత్తగా 50 విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్‌లతో పాటు హెలిప్యాడ్స్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఉడాన్‌ స్కీమ్‌ను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు ఆర్థిక మంత్రి. ఈ నిర్ణయంతో దేశంలో రీజియనల్ కనెక్టివిటీని పెంచేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు. దీంతో పాటు మరి కొన్ని కీలక ప్రకటనలూ చేశారు నిర్మలా సీతారామన్. ముఖ్యంగా మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించారు. అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మహిళా సమ్మాన్ బచత్ పత్రాను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. రెండేళ్ల పాటు రూ.2 లక్షలు పొదుపు చేసుకునే అవకాశముంటుంది. 7.5 వడ్డీ రేటు నిర్ణయించారు. బాలికలు, మహిళలు ఈ అకౌంట్‌ను ఓపెన్ చేసే వెసులుబాటు ఉంటుంది. అయితే...ఈ డబ్బుని విత్‌డ్రా చేసుకోవాలంటే మాత్రం కొన్ని కండీషన్స్ ఉంటాయి. మహిళా సంక్షేమానికి ఇది పెద్ద పీట వేస్తుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 


వేతన జీవులకు ఊరటనిచ్చిన ఆర్థిక మంత్రి.. పాత ట్యాక్స్‌ సిస్టమ్‌కి స్వస్తి పలికి కొత్త విధానం తీసుకొచ్చారు. ఇదే సమయంలో ఏయే వస్తువుల ధరలు పెరుగనున్నాయి, తగ్గనున్నాయో కూడా వెల్లడించారు. ఆ లిస్ట్ ఓ సారి చూద్దాం. 


ధరలు తగ్గేవి 


. మొబైల్ ఫోన్స్, కెమెరా లెన్స్ 
. విదేశాల నుంచి వచ్చే వెండి 
. టీవీలు, బయోగ్యాస్ 
. టీవీ విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు 
. విద్యుత్ వాహనాలు, బొమ్మలు, సైకిళ్లు 



ధరలు పెరిగేవి


. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ పెంపు
. సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీ 16% వరకూ పెంపు


.టైర్లు, బ్రాండెడ్ దుస్తులు, కిచెన్ చిమ్నీలు