Dawood Ibrahim News:


దావూద్‌ మృతి..? 


మోస్ట్ వాంటెడ్ అండర్‌ వరల్డ్ డాన్‌ దావూద్ ఇబ్రహీం చనిపోయాడా..? ABP News కి విశ్వసనీయ వర్గాలు (Is Dawood Dead) అందించిన సమాచారం ప్రకారం ఇది నిజమే (Dawood Ibrahim Death News) అని తెలుస్తోంది. దావూద్‌పై విషప్రయోగం జరిగిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కరాచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే...ఆసుపత్రిలోనే దావూద్ ఇబ్రహీం కన్నుమూసినట్టు సమాచారం. డిసెంబర్ 17న రాత్రి 8-9 గంటల మధ్యలో దావూద్ చనిపోయినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఫేక్ ఐడీలు, పాస్‌పోర్ట్‌లతో దేశదేశాలు తిరిగిన దావూద్ ఇబ్రహీం...చివరకు పాకిస్థాన్‌లో సెటిల్ అయినట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నాడట. అయితే...పాకిస్థాన్ మాత్రం ఈ వాదనను కొట్టిపారేసింది. దావూద్ తమ దేశంలో లేడని బుకాయించింది. ఈ ఏడాది జనవరిలో దావూద్ మేనల్లుడు NIAకి కీలక వివరాలు వెల్లడించాడు. ఇబ్రహీం కరాచీలోనే ఉంటున్నాడని, రెండో పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు. ప్రస్తుతానికి పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ సర్వీస్‌లపై ఆంక్షలు విధించారు. దావూద్‌కి సంబంధించి ఎలాంటి పుకార్లూ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసింది. కొన్ని చోట్ల భారీ ఎత్తున ర్యాలీలు జరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. పాకిస్థాన్ జర్నలిస్ట్ ఒకరు ట్విటర్‌, గూగుల్, యూట్యూబ్ సర్వీస్‌లను దేశవ్యాప్తంగా నిలిపివేసినట్టు ప్రకటించారు. దావూద్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్‌ నెట్‌వర్క్ "D Company"కి అధిపతి. 1993లో ముంబయి దాడుల వెనక మాస్టర్ మైండ్ ఇతనే. 


దావూద్ బ్యాగ్రౌండ్ ఇదే..


National Investigating Agency (NIA) ప్రకారం... D Company డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, బెదిరింపులు, ఆయుధాల స్మగ్లింగ్‌ లాంటివి పెద్ద ఎత్తున చేస్తోంది. దావూద్‌ని ఇప్పటికే భారత్‌ సహా ఐక్యరాజ్య సమితి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాయి. ముంబయిలో 90ల్లో మామూలు క్రిమినల్‌గా జర్నీ మొదలు పెట్టిన దావూద్ ఇబ్రహీం కొద్ది కాలంలోనే గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. ఆ తరవాత మొత్తం మాఫియాని గుప్పిట్లో పెట్టుకున్నాడు. దావూద్ బ్యాక్‌డ్రాప్‌తో బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. సెంట్రల్ ముంబయిలోని డోంగ్రిలో 1955లో జన్మించాడు. చిన్నప్పటి నుంచే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. అప్పట్లో ముంబయిలో బడా డాన్ అయిన హాజీ మస్తాన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తరవాత హాజీ మస్తాన్‌కే ధమ్‌కీ ఇచ్చాడు. అతడి గ్యాంగ్‌లోని సభ్యులందరినీ చంపేశాడు. ఈ గ్రూప్ కొట్లాటలు 1984 నాటికి హింసాత్మకంగా మారాయి. ఆ సమయంలో దావూద్‌ ముంబయి వదిలి దుబాయ్‌కి పారిపోవాల్సి వచ్చింది. 1993లో అయోధ్యలోని బాబ్రీ మసీదుని కూల్చేశారు. ఈ ఘటన తరవాత...ముంబయిలో దాదాపు 13 చోట్ల బాంబు దాడులు చేయించాడు దావూద్. ఈ దాడిలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. FBIతో పాటు ఇంటర్‌పోల్‌ కూడా దావూద్‌ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ప్రకటించాయి. దావూద్‌కి పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ISIతోపాటు లష్కరే తోయిబాతో సన్నిహిత సంబంధాలున్నాయి. రకరకాల పేర్లు, ఫేక్ పాస్‌పోర్ట్‌లతో దేశాలు తిరుగుతూ ఉంటాడు దావూద్.


Also Read: డొనేట్‌ ఫర్‌ దేశ్‌ పేరుతో కాంగ్రెస్ క్రౌడ్‌ ఫండింగ్‌, ఇంక్విలాబ్‌ మూవీ వీడియోను షేర్ చేసిన బీజేపీ