Undavalli Said Ramoji Rao is  powerfull person :  భారతదేశంలో రామోజీరావు అంత పలుకుబడి ఉన్న వ్యక్తిని తాను మరెక్కడా చూడలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ్న్నారు.  రామోజీరావు గారి మరణం వార్త తెలిసిన తర్వాత రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. రామోజీరావు మరణం బాధాకరం వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి అని తెలిపారు.  ఆయన ఎవరితోని రాజీ పడకుండా పూర్తి జీవితం గడిపారన్నారు.  ఆయన కలుద్దామని చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ సాధ్యం కాలేదన్నారు.  ఆ విషయంలో సంతృప్తిగా ఉన్నాను ఒక ఫైటర్ గానే ఆయన కాలం చేశారన్నారు.  రామోజీరావు ఏ రంగంలోకి ప్రవేశించినా ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగారని గుర్తు చేసుకున్నారు. 


రామోజీరావుపై కేసులు వేసిన ఉండవల్లి                                               


రామోజీరావుపై ఆర్థిక పరమైన ఆరోపణలు చేసి ఆయనపై కోర్టుల్లో పిటిషన్లు వేసింది ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ సంస్థ చట్టపరమైన నిబంధనలు పాటించడం లేదంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ హోదాలో పలు కేసులు వేశారు.డిపాజిట్ల సేకరణ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా సాగిందని ఉండవల్లి ఆరోపణ కాగా, అందరికీ డిపాజిట్లు తిరిగి చెల్లించామని మార్గదర్శి  స్పష్టం చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా డిపాజిట్లు సేకరించకూడదని.. అయినా సేకరించారని ఆయన కేసులు వేశారు. 


మార్గదర్శిపై ఇప్పటికీ ఆరోపణలు చేస్తున్న ఉండవల్లి                                               


ఆ కేసుల కారణంగా ఈటీవీ మీడియా నెట్ వర్క్ లో ఇతర రాష్ట్రాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యాన్ని అమ్మేసి డిపాజిట్లు చెల్లించేశారు.  తాను ఎంపీగా దిగిపోయినప్పటికీ, కాంగ్రెస్ అధికారంలో లేనప్పటికీ, ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం నిరంతరం ఆ కేసును కొనసాగిస్తూ వచ్చారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీ సీఐడీ కూడా మార్గదర్శిపై కేసు పెట్టి, రామోజీ రావును విచారించింది. మీడియా ద్వారా తమను ఇబ్బంది పెడుతున్నారన్న ఉద్దేశంతోనే ఉండవల్లి ద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ ఇబ్బంది పెట్టారన్న అభిప్రాయాలు ఉన్నాయి. 


దేనికీ లొంగలేదని ప్రశంసించిన రామోజీరావు                                                              


ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా రామోజీరావును ప్రశంసిస్తున్నారు. ఆయన దేనికీ లొంగలేదని.. ఫైటర్ గనే చనిపోయారని అంటున్నారు. రామోజీరావు 87 ఏళ్ల వయసులో గుండె సంబంధిత సమస్య కారణంగా శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు.