UK Cop Attacks Pakistani: యూకేలో దారుణ ఘటన జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లో ఓ పోలీస్ పాకిస్థానీ కుటుంబంపై దాడి చేశాడు. విచక్షణారహితంగా కొట్టాడు. తలపై కాళ్లతో తన్నాడు. బాధితుడు కింద పడిపోయినా వదలకుండా దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియో సంచలనమైంది.  Manchester Airport లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసులకు వ్యతిరేకంగా పలు చోట్ల నిరసనలు చేపట్టారు. అంత పాశవికంగా దాడి చేసిన పోలీస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీస్ డిపార్ట్‌మెంట్ సీరియస్ అయింది. వెంటనే ఆ పోలీస్‌ని విధుల నుంచి తప్పించింది. అయినా ఆందోళనలు ఆగడం లేదు. మాంచెస్టర్ ఎయిర్‌పోర్ట్‌లోని టర్మినల్ 2 వద్ద వద్ద చాలా సేపు గందరగోళం నెలకొంది.




ఓ కేసులో అనుమానితుడిని అరెస్ట్ చేసేందుకు నలుగురు పోలీసులు వెళ్లారు. ఆ సమయంలోనే  పోలీసులపై కొందరు దాడి చేశారు. ఆగ్రహంతో రగిలిపోయిన ఓ పోలీస్ వెంటనే ఎదురు దాడికి దిగాడు. ముందు వెనకా ఆలోచించకుండా కొట్టాడు. ఈ ఘర్షణలో ఓ మహిళా పోలీస్‌కి గాయమైంది. పరిస్థితి ఏదైనా ఆ స్థాయిలో ఓ వ్యక్తిపై దాడి చేయడం ఏ మాత్రం తగదని పోలీస్ ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. వెంటనే ఆ పోలీస్‌ని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. అయితే...మొత్తం 5గురు పోలీసులు ఈ దాడి చేశారని తరవాత తేలింది. ఈ పోలీసులందరిపైనా సస్పెన్షన్ వేటు వేశారు. 


"ఈ వీడియోలు చూసి చాలా మంది ఆందోళన చెందిన మాట నిజమే. మాంచెస్టర్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ వ్యక్తిపై పోలీస్ దాడి చేసిన ఈ వీడియో ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతోంది. ఈ ఘటన మాకు దిగ్భ్రాంతి కలిగించింది. ప్రజలు ఆ స్థాయిలో నిరసనలు ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోగలం. విధుల నుంచి ఓ పోలీస్ ఆఫీసర్‌ని తొలగించాం"


- ఉన్నతాధికారులు




అయితే..సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికే ఈ వీడియోపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. రొచాడ్లేలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసన చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వీడియోపై మేయర్ కూడా స్పందించారు. ఈ ఘటనతో తాను చాలా డిస్టర్బ్ అయ్యాయని వెల్లడించారు. పోలీసుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్టు వివరించారు.