ఆధార్ లేనిదే ఇప్పుడు ఏ ఆధారం దొరకని పరిస్థితి. అందుకే అందరూ ఆధార్ కార్డుని సురక్షితమైన పద్దతిలో ఉంచుకోవాలనుకుంటున్నారు. ఇటీవల పీవీసీ ఆధార్ పాపులర్ అయింది. పీవీసీ ఆధారిత ఆధార్ కార్డు అనేక భద్రతలతో కూడిన ఫోటోగ్రాఫ్, డెమోగ్రాఫిక్ వివరాలతో డిజిటల్‌గా సంతకం చేసిన సురక్షిత క్యూఆర్ కోడ్ కలిగి ఉంటుంది. ఈ కార్డు ఏటీఎం కార్డు పరిమాణంలో ఉంటుంది. దీనిన్ నీటిలో వేసిన కూడా తడవదు.
అయితే ఉడాయ్ మాత్రమే కాదు.. ప్రైవేటు సంస్థలు కూడా ఈ ఆధార్ పీవీసీ కార్డులను ఇస్తున్నారు. దీనిపై ఉడాయ్ ఆందోళన వ్యక్తం చేసింది. బహిరంగ మార్కెట్లో తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని యుఐడీఏఐ నిషేదించింది. బయటి మార్కెట్లో తయారు చేస్తున్న నకిలీ పీవీసీ కార్డులను ఉపయోగించడం మంచిది కాదని స్పష్టం చేసింది.
బయట సంస్థలు తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కార్డ్‌లు ఎలాంటి సెక్యూరిటీ లేదా సెక్యూరిటీ ఫీచర్‌లను కలిగి ఉండవని తెలిపింది. కాబట్టి ప్రింటెడ్ పీవీసీ ఆధార్ కార్డ్‌ని తీసుకోవద్దని ప్రజలకు సూచించింది. పీవీసీ ఆధార్ కార్డు కావాలంటే రూ.50 చెల్లించి ప్రభుత్వ ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చని యూఐడీఏఐ ట్వీట్ చేసింది. ఆర్డర్ కోసం ఒక లింక్ కూడా యుఐడీఏఐ ట్విటర్ వేదికగా షేర్ చేసింది.
Also Read: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
యూఐడీఏఐ వెబ్సైట్(https://myaadhaar.uidai.gov.in/) లో 'ఆర్డర్ ది పీవీసీ కార్డ్' ఆప్షన్‌ను క్లిక్ చేసి.. వివరాలు నింపి.. రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఆధార్ కార్డులో ఉన్న అడ్రెస్‌కు పీవీసీ కార్డు వచ్చేస్తుంది. బయట వ్యక్తుల నుంచి తీసుకుంటే ఆ ఆధార్ కార్డు పని చేయదు.