Elon Musk Twitter Private:
ఫీచర్‌ను టెస్ట్ చేసిన మస్క్..
ట్విటర్‌లో రోజుకో మార్పు వస్తోంది. ఎలన్ మస్క్ హస్తగతం అయినప్పటి నుంచి రోజూ వార్తల్లో నిలుస్తోంది ఈ కంపెనీ. ఆర్థిక నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నానంటూ మస్క్ చెబుతున్నా...ఆయన తీసుకునే ప్రతి నిర్ణయమూ సంచలనమవుతోంది. కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు మస్క్. ఈ క్రమంలోనే తన ట్విటర్ అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితమే... ట్విటర్‌లో పబ్లిక్, ప్రైవేట్ పోస్ట్‌ల ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ట్విటర్ యూజర్స్..ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఫీచర్ సరిగ్గా పని చేయడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంప్లెయింట్స్ ఆధారంగా..మస్క్ ఆ ఫీచర్‌ను టెస్ట్ చేయాలనుకున్నారు.
అందుకే...తన అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకున్నారు. ఫీచర్‌లో కొన్ని టెక్నికల్ సమస్యలున్నాయని...త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని వెల్లడించారు. అప్పటికే ఓ యూజర్ ఈ ఫీచర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. తన అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టినా...పబ్లిక్ ఫీచర్ కన్నా ఎక్కువ మందికి రీచ్ అవుతోందని చెప్పాడు. దీనికి రెస్పాండ్ అయిన మస్క్ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని...త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరవాత వెంటనే తన అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకుని టెస్ట్ చేశారు.
పేరు కూడా మారింది..
ఎప్పటికప్పుడు కొత్త ట్వీట్లతో ఆకట్టుకునే టెస్లా అధినేత తాజాగా తన పేరు మార్చుకున్నారు. ట్విట్టర్ అకౌంట్ కు ఎలన్ మస్క్ అనే పేరు ఉండగా ఇప్పుడు దాన్ని ‘మిస్టర్ ట్వీట్’గా మార్చేశారు. పేరు మార్చుకున్న తర్వాత ఆయన ఓ ట్వీట్ చేశారు. “నా ట్విట్టర్ అకౌంట్ పేరును మిస్టర్ ట్వీట్ అని మార్చుకున్నాను. కానీ, తిరిగి మార్చాలి అనుకున్నా ట్విట్టర్ అనుమతించడం లేదు” అంటూ ఫన్నీ ఎమోజీని పోస్టు చేశారు. ఆయన ట్వీట్ పై నెటిజన్లను చెలరేగిపోతున్నారు. పలువురు ఆయనను ఆటాడేసుకుంటున్నారు. ఎందుకు పేరు మార్చారంటూ ఫన్నీ ట్వీట్లు చేస్తున్నారు. ఎలన్ మస్క్ వ్యవహారం ట్విట్టర్ ను కామెడీ చానెల్ గా మార్చేస్తున్నట్లు అనిపిస్తోందని నెటిజన కామెంట్ చేశారు. మార్చేసినట్లు అనిపించడం కాదు, నిజంగానే కామెడీ చానెల్ గా ఉందంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. పేరు మార్చుకున్న వాళ్లంతా బ్లూ టిక్ కోల్పోయారు. మరి మీ అకౌంట్ ఎందుకు బ్లూ టిక్ కోల్పోలేదు? అంటూ మరో నెటిజన్ క్వశ్చన్ చేశారు. ఇకపై నా అకౌంట్ పేరును ఎలన్ మస్క్ అని పెట్టుకుంటాను అంటూ మరో నెటిజన్ బదులిచ్చాడు. వరుస ట్వీట్లతో మస్క్ పై జోకులు పేల్చుతున్నారు.
ఎన్నో మార్పులు..
గత సంవత్సరంలో ట్విట్టర్ ను కోనుగోలు చేసిన తర్వాత మస్క్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తను అనుకున్న విధంగా ట్విట్టర్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న ట్విట్టర్ ను లాభాల బాట పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సుమారు సగానికి పైగా ఉద్యోగులను తొలగించారు. పలు దేశాల్లోని ట్విట్టర్ కార్యాలయాలను అమ్మకానికి పెట్టారు. ఇన్నీ చేసినా ఆయన అనుకున్నట్లుగా లాభాల్లోకి రాకపోగా మరింత నష్టాల్లో కూరుకుపోతోంది.
Also Read: Mumbai Terror Threat: ముంబయిలో మళ్లీ దాడులు చేస్తాం, NIAకి వార్నింగ్ ఇస్తూ మెయిల్ పంపిన తాలిబన్!