నందు కేఫే బిజినెస్ స్టార్ట్ చేస్తానని అనేసరికి లాస్య చిర్రుబుర్రులాడుతుంది. తనని కన్విన్స్ చేయమని లాస్య దగ్గరకి అనసూయ వస్తుంది. అసలు ఆస్తి ఆయన పేరు మీద రాసి ఉంటే ఈ గోల ఉండేది కాదు కదా అని లాస్య అంటుంది. ఉత్తమ ఇల్లాలు అవ్వాలంటే వేషాలు వేసుకోవడం కాదు అని పద్యం చెప్పి కాస్త తిట్టేసి అనసూయ వెళ్ళిపోతుంది. తులసి శ్రుతికి తినిపిస్తూ ఉంటుంటే ప్రేమ్ వచ్చి వెళ్ళిపోతాడు. ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావ్ అని అంటుంది. నువ్వు ఆయనకి సహాయం చేయాలని ఆయనకి ఇవ్వాలనుకున్నపుడు ఇంటిని రాసి ఇవ్వవచ్చు కదా అని ప్రేమ్ అంటాడు. ఆస్తి, డబ్బు ఇస్తే ఆయన మనసు పాడు చేసి డబ్బు వృధా చేస్తుందని తులసి అంటుంది.


ఆయన నా భర్త అనే విషయం నీ మనసులో నుంచి తీసేయ్. ఆయనకి మనం తప్ప వేరే ఎవరున్నారు. ఎదుటి మనిషి ఎలాంటి వాడు అని ఆలోచించి సహాయం చేయకూడదు. అతని పరిస్థితి చూసి సాయం చేయాలని తులసి వేదాంతం చెప్తుంది. దీంతో తల్లి మాటలకి కరిగిపోయి స్థలం ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. లాస్య ఆ శ్లోకం అర్థం ఏంటో తెలుసుకోవాలని డిక్షనరీ వెతుకుతుంది. ఒక్కో అక్షరం గుర్తు చేసుకుని మరీ దాని వెతకాలని డిక్షనరీలో చూస్తుంది కానీ కనిపించదు. అత్తయ్య చెప్పిన పద్యం అర్థం చెప్పే వ్యక్తిని ప్రత్యక్ష్యం చేయమని లాస్య కోరుకోగానే నందు వస్తాడు. అదేదో కార్యేషు దాసి అని ఏదో పద్యం చెప్పింది దాని అర్థం చెప్పమని అడుగుతుంది.


Also Read: యష్, వేద క్యూట్ రొమాన్స్- పెళ్లి చేసుకుంటానని మాళవికకి మాటిచ్చిన అభిమన్యు


నందు పద్యం చెప్తూ ఒక్కొక మాట చెప్తూ దాని అర్థాలు వివరిస్తాడు. అంతా విన్న తర్వాత ఈ పద్యం మగవాడు రాశాడు, అందుకే మగవాడికి అనుకూలంగా రాసుకున్నాడని దాన్ని మగవాళ్ళకి వ్యతిరేకంగా చెప్పి కాసేపు నవ్విస్తుంది. అది విని నవ్వలేక ఏడవలేక మొహం పెట్టేసి వెళ్ళిపోతాడు. అనసూయ వాళ్ళకి తులసి ఫ్రూట్స్ తీసుకుని వస్తుంది. అప్పుడే నందు కేఫే ప్లాన్ డ్రాప్ చేసుకున్నా అని ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అది విని తులసి కేఫే నిర్ణయం డ్రాప్ అయ్యారు అని మాకు చెప్పలేదేంటి అని అడుగుతుంది. మ్యూజిక్ అకాడమీ పక్కన కేఫే పెడతానంటే ప్రేమ్ ఒప్పుకోలేదు కదా అని నందు అంటాడు. లాస్య కూడా ఎంత చెప్పినా కూడా ఒప్పుకోవడం లేదు, అందుకే మళ్ళీ ఉద్యోగాల వేట మొదలుపెట్టానని చెప్తాడు. అప్పుడే ప్రేమ్ వచ్చి అమ్మ నిర్ణయమే మా నిర్ణయమని అంటాడు.


లాస్య కూడా వచ్చి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అన్నాకాని ఏమి అడ్డు పడలేదు కదా అని అంటుంది. వాళ్ళ మాటలు విని నందు హ్యాపీగా ఉంటాడు. మూడు నెలల్లో కేఫ్ లాభాల్లో పడాలి అప్పుడే నేను నీకు అడ్డం పడను లేదంటే నీ నా మాట వినాలని లాస్య కండిషన్ పెడుతుంది. నందు వెళ్ళి ప్రేమ్ ని హగ్ చేసుకుంటాడు. కేఫ్ కి మంచి పేరు పెడదామని శ్రుతి అంటుంది. తులసి పేరు పెట్టమని పరంధామయ్య అంటాడు. లాస్య మాత్రం వద్దని అంటుంది. అప్పుడు తులసి అందరి కంటే చిన్నవాడు లక్కీ వాడి పేరు పెడదామని అంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. అభి గాయత్రి దగ్గరకి వస్తాడు. మీ నాన్న కేఫ్ పెడుతున్నాడనే విషయం నాకే చెప్పలేకపోతున్నావ్ ఇంక సొసైటీలో నీకు మర్యాద ఏముంటుందని గాయత్రి రెచ్చగొడుతుంది.


Also Read: నందుకి బిజినెస్ ఐడియా ఇచ్చి సాయం చేసిన తులసి- అడ్డం తిరిగిన ప్రేమ్


ఇంటిల్లిపాది డాడ్ కి సపోర్ట్ చేస్తున్నారు నేనేం చెయ్యను. ఇక్కడ ఉంటే పెళ్ళాం లేకుండా నువ్వు ఎందుకు ఇక్కడ అని నన్ను తరిమేశారు అని అభి అంటాడు. మరి ఎక్కడ పెళ్ళాంతో పుట్టింట్లో సెటిల్ అయిపోయావ్ అని దెప్పిపొడుస్తుంది. అక్కడ ఉన్నాననే కానీ ఎదుగుబొదుగు లేదు, ముళ్ళ మీద ఉన్నట్టు ఉందని అభి అంటాడు.