ఏ ఫ్లేవర్ కావాలో చెప్పండి: కాఫీలు సర్వ్ చేసిన పరాగ్ అగర్వాల్
ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఉద్యోగులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. లండన్‌లోని ఆఫీస్‌లో ఎంప్లాయిస్‌కు కాఫీ సర్వ్ చేశారు. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్‌తో కలిసి కాఫీ అందించారు. ఉద్యోగుల నుంచి కాఫీ ఆర్డర్ తీసుకుంటున్న ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. రెబెకా అనే ఓ ఎంప్లాయ్ ఈ పిక్స్‌ని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లోని ఓ బోర్డ్‌పై రకరకాల కాఫీల ఫ్లేవర్స్ లిస్ట్ కనిపించింది. అటు పక్కనే సీఈవో పరాగ్ అగర్వాల్ నిలబడి ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలో అడుగుతున్నారు. కౌంటర్‌లో వీళ్లిద్దరూ ఉండటం చూసి ఉద్యోగులంతా కాఫీ కోసం క్యూ కట్టారు. ఈ ఫోటోలు ట్విటర్‌లో వైరల్ అయ్యాయి. సీఈవో స్థాయి వ్యక్తి ఇంత ఫ్రెండ్లీగా, సింపుల్‌గా ఉండటం గొప్ప విషయం అంటూ పరాగ్ అగర్వాల్‌ని మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే వందల కొద్ది లైక్‌లు వచ్చాయి ఈ పోస్ట్‌కి. కాఫీ సర్వ్ చేయటమే కాదు. స్టాండప్ కామెడీలోనూ పార్టిసిపేట్ చేసి ఉద్యోగులను అలరించారు పరాగ్ అగర్వాల్. దరా నసర్‌తో కలిసి స్టాండప్ కామెడీలో పాలు పంచుకున్నారు.
స్టాండప్ కామెడీలోనూ మెరిసిన అగర్వాల్
ఈ స్టాండప్ కామెడీ షో కి సంబంధించిన ఫోటోలను పరాగ్ అగర్వాల్ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. "ఎంతో ఫన్నీగా సాగింది" అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్విటర్ సీఎఫ్‌ఓ కూడా ఈ పోస్ట్‌ని రీట్వీట్ చేశారు. ఎంప్లాయిస్‌తో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్‌లో ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వార్ ఉద్యోగులకు కాఫీ సర్వ్ చేస్తూ కనిపించారు. గతేడాది నవంబర్ వరకూ ట్విటర్‌కు సీఈవోగా జాక్ డోర్సే ఉన్నారు. ఆయన ఆ పదవి నుంచి దిగిపోయాక పరాగ్ అగర్వాల్ బాధ్యతలు తీసుకున్నారు. భారత మూలాలున్న పరాగ్ అగర్వాల్ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు.
Also Read: Chiru Modi Bonding : మోదీ ఆత్మీయతకు చిరంజీవి ఫిదా ! రాజకీయం మారే చాన్స్ ఉందా ?