Twitter Blue Tick in India:


ట్విటర్‌లో చెప్పిన మస్క్..


ట్విటర్ బ్లూ మరో నెల రోజుల్లో భారత్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ని త్వరలోనే తీసుకొచ్చేందుకు ట్విటర్ ప్లాన్ చేస్తోంది. ఓ ట్విటర్ యూజర్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ "ట్విటర్ బ్లూ ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది" అని ప్రశ్నించగా...ఎలన్ మస్క్ దీనికి బదులిచ్చారు. "నెల రోజుల లోపే"అని సమాధానమిచ్చారు. ఇక ట్విటర్ బ్లూ యూజర్స్ నుంచి నెలనెలా 8 డాలర్లు వసూలూ చేయాలని ఇప్పటికే ట్విటర్ నిర్ణయించింది. ఈ మేరకు అప్లికేషన్‌లో మార్పులు చేస్తూ యాపిల్‌ స్టోర్‌లో అప్‌డేట్ చేసింది. యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్, యూకేలోనూ ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. మొదటి విడతలో ఈ దేశాల్లోఅందుబాటులోకి తీసుకొచ్చి..ఆ తరవాత మిగతా దేశాలకూ విస్తరిస్తామని ట్విటర్ చెబుతోంది. ఇందుకు సంబంధించిన ట్రాన్స్‌లేషన్ వర్క్ పూర్తైందని మస్క్ వెల్లడించారు కూడా. అటు లేఆఫ్‌ల ప్రక్రియనూ మస్క్ మొదలు పెట్టారు. ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఈ ఉద్యోగుల తొలగింపుపై ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు. కంపెనీ రోజుకు 4 మిలియన్ డాలర్లు నష్టపోతున్నందున తనకు వేరే మార్గం లేదని చెప్పుకొచ్చారు. అందుకే ఉద్యోగాలను తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులందరికీ మూడు నెలల శాలరీ ఇస్తున్నామన్నారు. ఇది చట్టబద్ధంగా 50 శాతం ఎక్కువ అని మస్క్ చెప్పారు. 


లేఆఫ్‌లు, మార్పులు..


గత వారం ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తోపాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ), మరికొందరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లను  మస్క్ తొలగించారు. కొత్త యాజమాన్యంలో ఇమడలేమనుకున్న వాళ్లు చాలా మంది తమకు తాముగా తప్పుకున్నారు. ఉద్యోగులను కూడా తొలగిస్తారని.... పేరు చెప్పడానికి ఇష్టపడని ట్విట్టర్ ఇండియా ఉద్యోగి ఒకరు చెప్పారు. తన సహచరులు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే మెయిల్స్ సమాచారం అందుకున్నారని వివరించారు. ఈ తొలగింపు భారత్‌ టీంపై ఎక్కువ ఎఫెక్ట్ పడిందని టాక్. అయితే దీనిపై ట్విట్టర్ ఇండియా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. వెరిఫైడ్ అకౌంట్‌లు బ్లూ టిక్‌ కంటిన్యూ చేయాలంటే నెల వారీగా ట్విటర్‌కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనిపై  పూర్తిస్థాయి కసరత్తు జరుగుతోంది. ట్విటర్ ఉద్యోగులంతా మేధోమథనం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీనిపై ఇప్పటికే ట్విటర్ యూజర్లు  భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులూ స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే..ప్రముఖ సినీ క్రిటక్, ట్రేడ్ అనలిస్ట్ కేఆర్‌కే ట్విటర్ వేదికగా స్పందించారు. ఎలన్‌మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. "డియర్ ఎలన్ మస్క్. నెలనెలా డబ్బులు కట్టేంత టైమ్ నాదగ్గర లేదు. అడ్వాన్స్‌గా ఐదేళ్లకు ఒకేసారి చెల్లిస్తాను. దయచేసి ఆ పేమెంట్ లింక్ఉంటే పంపండి" అని ట్వీట్ చేశారు. అత్యవసర ప్రాతిపదికన కంపెనీ కంప్యూటర్లు, ఇమెయిల్స్ కు యాక్సెస్ కూడా తీసేసింది. 


Also Read: Haryana Stubble Management: మద్దతు ధర ఇచ్చి మరీ గడ్డి కొంటారట, హరియాణా ప్రభుత్వం నిర్ణయం!