Pakistan's Govt Twitter:
లీగల్ డిమాండ్‌లో భాగంగా..
భారత్‌లో పాకిస్థాన్ గవర్నమెంట్ ట్విటర్ అకౌంట్‌ను నిలిపివేశారు. లీగల్ డిమాండ్‌లో భాగంగా...ఈ నిర్ణయం తీసుకున్నారు. @GovtofPakistan ట్విటర్ అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన వారికి ఓ పాపప్ కనిపిస్తోంది. "ప్రస్తుతానికి అకౌంట్ నిలిపివేశాం" అని చూపిస్తోంది. ప్రస్తుతానికి ఇండియన్ యూజర్స్ ఎవరికీ ఈ అకౌంట్ కనిపించటం లేదు. గతంలోనూ ఇలానే జులైలో ఓ సారి అకౌంట్ నిలిపివేశారు. తరవాత రీయాక్టివేట్ చేశారు. ఇప్పుడు మరోసారి నిలిపివేశారు. గైడ్‌లైన్స్ ప్రకారమే...ఈ నిర్ణయం తీసుకున్నామని ట్విటర్ వెల్లడించింది. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకున్నామని స్పష్టం చేసింది. భారత్ ఎప్పటి నుంచో ఈ విషయమై తన డిమాండ్‌ను వినిపిస్తోంది. వినియోగదారుల సమాచారం సేకరించటంలో భారత్ రెండో స్థానంలో ఉండగా...కంటెంట్ బ్లాక్ చేయమని ట్విటర్‌ను డిమాండ్ చేసిన దేశాల్లోనూ భారత్ ముందు వరసలో ఉంది. నిర్ణీత అకౌంట్లు భారత్‌లోని యూజర్స్ ఎవరికీ కనిపించకుండా నిలిపివేయాలని చట్టపరంగా డిమాండ్ చేసింది.
వెల్లువెత్తిన ఫిర్యాదులు..
గతేడాది చివరి ఆర్నెల్లలో ట్విటర్‌కు ఇలాంటివి 326 డిమాండ్‌లు వెల్లువెత్తాయి. కొందరు వెరిఫైడ్ జర్నలిస్ట్‌లు, న్యూస్ కంపెనీలు పోస్ట్ చేసే కంటెంట్‌ను బ్లాక్ చేయాలని ఫిర్యాదులొచ్చాయి. వాటిలో 114 అకౌంట్లు ఇండియాకు చెందినవే. అంటే...మూడొంతుల డిమాండ్‌లు భారత్ నుంచే వెళ్లాయి. టర్కీ, రష్యా, పాకిస్థాన్ కూడా ఇలాంటి ఫిర్యాదులే ఇచ్చాయి. " ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెరిఫైడ్ జర్నలిస్ట్‌లు, న్యూస్ అవుట్‌లెట్స్‌కి సంబంధించిన 349 అకౌంట్లలో 326 అకౌంట్లకు లీగల్ డిమాండ్‌లు వచ్చాయి. గతేడాది జనవరి-డిసెంబర్‌తో పోల్చి చూస్తే..ఈ డిమాండ్ 103%మేర పెరిగింది. భారత్ నుంచి 114, టర్కీ నుంచి 78, రష్యా నుంచి 55, పాకిస్థాన్ నుంచి 48 డిమాండ్‌లున్నాయి.
Also Read: PM Modi Launches 5G: 5G సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ, ముందుగా ఆ నగరాల్లోనే