5G Launched In India:
IMC సదస్సులో లాంచ్..
భారత్‌లో 5G సేవల్ని ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC 2022) సదస్సులో పాల్గొన్న మోదీ...5G సర్వీస్‌లను ఆవిష్కరించారు. మరో రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా ఈ సర్వీస్‌లు అందించనున్నాయి.
ముందు ఈ నగరాల్లోనే (5G Cities):
ప్రస్తుతానికి దేశంలో 13 నగరాల్లో 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గుడ్‌గావ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కత్తా, లక్నో, ముంబయి, పుణెల్లో లాంఛ్ చేస్తారు. ఇవాళ నాలుగు నగరాల్లో అందుబాటులోకి వస్తాయి. ఢిల్లీ, ముంబయి, కోల్‌కత్తా, చెన్నైల్లోని ప్రజలు 5G సర్వీస్‌లు పొందవచ్చు. ఢిల్లీలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ సేవలు పరిమితం కానున్నాయి. దాదాపు 4G కాస్ట్‌లోనే 5G టారిఫ్‌లు ఉంటాయని తెలుస్తోంది. రిలయన్స్, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ గ్రూప్‌లు 5G స్ప్రెక్టమ్‌ను సొంతం చేసుకునేందుకు బిడ్డింగ్ వేశాయి. రూ.1.50లక్షల కోట్లకు బిడ్ వేశారు. భారత్‌లో అత్యంత వేగవంతమైన 5G సేవల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రిలయన్స్ జియో వెల్లడించింది. 2023 లోగా దేశవ్యాప్తంగా ఈ సేవల్ని విస్తృతం చేసేందుకు ప్లాన్ చేసుకుంది ఈ సంస్థ.
వేలం విజయవంతం..
IMC 2022, అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకూ కొనసాగనుంది. "న్యూ డిజిటల్ యూనివర్స్" థీమ్‌తో ఈ సారి ఈవెంట్స్ జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీపై చర్చిస్తారు. వాటిని అందిపుచ్చుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో అభిప్రాయాలు పంచుకుంటారు. కొత్త అవకాశాలు సృష్టించేందుకూ...ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్..వేదికగా మారనుంది. డిజిటల్ టెక్నాలజీపై ఈ సారి ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నారు. గతంలో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 5G సర్వీస్‌లపై కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 12వ తేదీ నుంచి భారత్‌లో 5G సేవలు మొదలవుతాయని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే...ఇప్పుడు ప్రధాని మోదీ రేపు ఈ సేవల్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించింది. 2017లో తొలిసారి ఐదవ తరం (5G) వాయు తరంగాలను వేలం వేయాలని ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది.
ధరలు ఎక్కువగా ఉన్నాయని భావించిన టెలికాం కంపెనీలు ఇందుకు దూరంగా ఉన్నాయి. ఈసారి రూ.4.3 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినా చివరికు రూ. 1.5 లక్షల కోట్లకు వాయు తరంగాలను విక్రయించింది. ఇటీవలి స్పెక్ట్రమ్ బిడ్‌లు అనేక విధాలుగా విజయ వంతం అయ్యాయి. ఎందుకంటే 2017లో 3000 MHz బ్యాండ్‌లలో 5G ఎయిర్‌వేవ్ ప్రతిపాదిత విక్రయం పూర్తవ్వలేదు. 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 మెగాహెర్జ్ బ్యాండ్ (megaherzt) స్పెక్ట్రమ్ అమ్ముడవ్వలేదు. దాంతో వేలాన్ని వాయిదా వేయాలని టెలికాం కంపెనీలు పోరాడగా TRAI సంప్రదింపులు జరిపి విజయవంతం చేసింది.