Trisha Factor in Vijay's Win: తమిళ రాజకీయాల్లో సైలంట్ సునామీ దళపతి విజయ్.. ఇప్పుడు తమిళనాడు కొత్త సీఎం.. ఎన్నికలకు ముందు ఆయన సీఎం అవుతారని ఊహించిన వారు తక్కువే. .. తమిళనాడులో  అండర్‌ కరెంట్‌గా విజయ్ వేవ్ నడిచింది. ఈ విజయానికి కారణాలను రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా చెబుతారు. కానీ ఆయన హార్డ్‌ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఈ విజయంలో క్రెడిట్‌ను ఒకరికి ఇస్తున్నారు. విజయ్‌ విజయంలో ఆమె  X ఫ్యాక్టర్‌.. హీరోయిన్ త్రిష..

Continues below advertisement

విజయ్ లైఫ్‌లో త్రిష అంత స్పెషలా...?

 విజయ్ లైఫ్‌లో త్రిష అంత స్పెషలా...? వాళ్లిద్దరి బంధం అెంత బలమైందా అంటే దానికి ఫాన్స్ వెంటనే జస్టిఫికేషన్ ఇస్తారు. ద్రవిడ రాజకీయ కుంభస్థలం బద్ధలు కొట్టి గద్దెనెక్కారు విజయ్‌..! రెండేళ్లలో రాజకీయాన్నే మార్చేశాడు. పార్టీ అనౌన్స్‌ చేసి...నేరుగా సీఎం చైర్‌లో కూర్చున్నారు.అయితే రెండేళ్ల క్రితం పార్టీ పెట్టడానికి ముందు ఇంకొకటి జరిగింది. పదిహేనేళ్ల క్రితం బ్రేక్ అయిన మూవీ కాంబినేషన్ తిరిగి వర్కవుట్ అయింది. కోలీవుడ్‌ దళపతి విజయ్‌తో స్క్రీన్‌మీదకు స్మైలీ స్టార్ త్రిష వచ్చింది.అదే ఆయన దశను మార్చింది అని నమ్ముతారు.. ఫ్యాన్స్.  " అన్న "దశమార్చిన దేవత" అంటూ వాళ్లు పొంగిపోతున్నారు. ఆ కాంబోను.. “లక్కీ సింబల్”గా చూస్తున్నారు?

Continues below advertisement

త్రిష లక్కీ చార్మ్..!త్రిష విజయ్ కాంబినేషన్ 22 ఏళ్ల కిందట మొదలైంది. వెండితెరపై వాళ్లది హిట్‌పెయిర్. గిల్లీతో మొదలైన స్నేహం.. మొన్నటి లియో వరకూ ఉంది. అయితే మధ్యలో 15 ఏళ్లు వాళ్లిద్దరి సినిమాలకు గ్యాప్ వచ్చింది కానీ.. వాళ్లిద్దరి మధ్యా గ్యాప్ లేదన్నది కోలీవుడ్ ఇన్‌సైడ్ టాక్. అయితే 15 ఏళ్లు దూరంగా ఉన్న త్రిష.. కరెక్ట్‌గా ఆయన లైఫ్‌ టర్న్ అయ్యే ముందు ఎంటర్‌ అవ్వడం ఆ న్యూ జర్నీ సూపర్‌హిట్టవడంతో ఫ్యాన్స్‌ దృష్టిలో త్రిష ఓ లక్కీ చార్మ్ అయిపోయారు. 2000ల తమిళ సినిమా చూసిన జనరేషన్‌కు...విజయ్ - త్రిష అంటే ఒక ఎమోషన్.ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ...సాంగ్స్, ఫన్ మూమెంట్స్...ఇవన్నీ ఇప్పటికీ ఫ్యాన్స్ మైండ్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాయి.ఆవిడొ్చ్చాకనే అంతా మారిపోయింది అనే కామెంట్లు, మీమ్‌లు స్టార్ట్ అయ్యాయి.అందుకే ఇప్పుడు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే...సోషల్ మీడియాలో అది వెంటనే వైరల్ అవుతోంది. విజయ్‌లాగే త్రిషను ఆమె ఫ్యాన్స్‌ ఓన్ చేసుకున్నారు. అసలు విజయ్ విజయంలో అసలైన ఫ్యాక్టర్ త్రిషనే అనే స్థాయికి వచ్చారు. దానికి తోడు ఆమె నేరుగా ఎక్కడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా... ఫలితాల రోజు తిరుమల వెళ్లడం.. అదే రోజు విజయ్‌ను కలవడం.. క్యాడర్‌ను చీర్‌ చేయడం.. ఇవన్నీ తనను ఇంకో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక విజయ్ ప్రమాణ స్వీకారంలో త్రిష కనిపించేసరికే.. తన స్థానం ఏంటో అందరికీ అర్థమైపోయింది. విజయ్‌తో సమానంగా మీడియా త్రిషను ఫోకస్ చేసింది. 

అసలు TVK అంటే.. త్రిష- విజయ్ కృష్ణన్ తమిళగ.. వెట్రి కజగం ఇదీ టీవీకే పార్టీ పూర్తి పేరు. కానీ దీనిని త్రిష విజయ్ కృష్ణన్..అంటూ ఫ్యాన్స్ మార్చే పరిస్థితిి వచ్చింది. "అన్న ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా పార్టీ పేరు సెట్ చేసుకున్నాడు" అని లైట్‌గా జోక్స్ వేసుకుంటున్నవారు కూడా ఉన్నారు. 

 

తమిళనాడులో ఇది మామూలే..!సినిమా స్టార్లు.. పోలిటికల్ ప్లేయర్లు అవ్వడం తమిళనాడుకు కొత్తకాదు. అరవై ఏళ్లుగా సినిమారంగమే.. తమిళనాడు రాజకీయాన్ని శాసించింది. వీళ్లను చూసినప్పుడు  50 ఏళ్ల కిందట వచ్చి రాజకీయాలను శాసించిన మరో పెయిర్ గుర్తుకు రాక మానదు. తమిళ సూపర్‌స్టార్ MGR.. ఆయన హిట్‌ జోడీ జయలలిత ఇద్దరూ తమిళ రాజకీయాల్లో పీక్ స్థాయికి చేరారు. ఇద్దరూ ముఖ్యమంత్రులయ్యారు. MGR ఉన్నప్పుడు పార్టీ కార్యకలాపాల్లో ఉన్న జయ.. తర్వాతర్వాత సీఎం అయ్యారు. ఇప్పుడు  త్రిష కూడా...పార్టీలోకి వస్తారా.. అనే చర్చ రావడం సహజం. ఏమో తమిళనాడులో వినిపిస్తున్న మాటలేంటంటే.. విజయ్ రాజీనామా చేసే ఓ స్థానానికి త్రిష వెళతారని... చూడాలి మరి ఏం జరుగుతుందో.. అక్కడ అన్నీ ఊహించనివే అవుతున్నాయి కదా..