Trump declares he has stopped nuclear war between India and Pakistan: భారత్ , పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం రాకుండా ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.  తాము ఆపకపోతే అదే పెద్ద అణు విధ్వంసం అయి ఉండేదని చెప్పుకొచ్చారు.   లక్షలాది మంది చనిపోయి ఉండేవారన్వనారు.  ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ,  విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలకు కూడా ధన్యవాదాలు చెప్పాలన్నారు.  

 భారతదేశం ,  పాకిస్తాన్ నాయకత్వాలు బలంగా ఉన్నాయన్నారు. ఉద్రిక్తక  తీవ్రతను పూర్తిగా తెలుసుకోవడానికి,  అర్థం చేసుకోవడానికి  వారు ముందుకు వచ్చారని అభినందించారు. అమెరికా చాలా సాయం చేశామని ట్రంప్ తెలిపారు.  మేము మీతో చాలా వ్యాపారం చేయబోతున్నామని.. అందుకే ఉద్రిక్తల్ని ఆపుదామని చెప్పానని ట్రంప్ చెప్పుకొచ్చారు.   మీరు దానిని ఆపకపోతే, మేము ఎటువంటి వాణిజ్యం చేయబోవడం లేదని చెప్పానన్నారు.                           

అమెరికా మధ్యవర్తిత్వం చేశాయని భారత్, పాక్ ఎక్కడా చెప్పుకోవడం లేదు. కానీ ట్రంప్ మాత్రం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల్ని నివారించడానికి తామే ప్రయత్నం చేశామని పదే పదే చెబుతున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ.. ఎవరి మధ్యవర్తిత్వం అక్కర్లేదని.. చెబుతూ వస్తున్నారు. అయినా ట్రంప్ మాత్రం.. మేమే చేశామని చెప్పుకుంటున్నారు. తాను రంగంలోకి దిగకపోతే లక్షల ప్రాణాలు పోయేవని .. చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు తగ్గించకపోతే.. వాణిజ్యాన్ని రెండుదేశాల నుంచి నిలిపివేస్తానని కూడా హెచ్చరించానని అంటున్నారు.                 

ట్రంప్ సొంతంగా పొగడ్తలు కురిపించుకుంటున్నారు. అయితే తెర వెనుక ఏం జరిగిందో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.  తీవ్ర ఉద్రిక్తతల దిశగా..మిస్సైళ్లు కురిపించుకుంటున్న  భారత్, పాకిసాన్ అనూహ్యంగా కాల్పుల విరమణ ప్రకటించాయి. ఆ విషయాన్ని ముందుగానే ట్రంప్ ప్రకటించడంతో  అమెరికానే మధ్యవర్తిత్వం వహించిందని అనుకున్నారు.